27.7 C
Hyderabad
May 14, 2024 04: 42 AM
Slider విజయనగరం

సరిగ్గా మైనార్టీ వెల్ఫేర్ డే రోజు నే…విజయనగరం ఏఆర్ ఏఎస్పీ గా సాల్మన్ చార్జ్.

విజయనగరం జిల్లా ఆర్మర్డ్ అదనపు పోలీసు సూపరెంటెండెంట్ గా సాల్మన్ చార్జ్ తీసుకున్నారు. సరిగ్గా దేశ తొలి విద్యా శాఖ మంత్రి జన్మదినం రోజు నే విజయనగరం జిల్లా ఆర్మర్డ్ ఏఎస్పీ గా బాధ్యతలు చేపట్టారు.విజయనగరం జిల్లా ఆర్మ్డ్ రిజర్వు అదనపు ఎస్పీగా ఎం.ఎం.సోల్మన్ నవంబరు 11న ఆర్మడ్ రిజర్వు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. పోస్టు గ్రాడ్యుయేషన్, న్యాయ శాస్త్రంలో పట్టభద్రులైన ఎం. ఎం. సోల్మన్ 1991లో ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో రిజర్వు సబ్ ఇన్స్పెక్టరుగా పోలీసుశాఖలో చేరి, 1999 రిజర్వు ఇన్స్ పెక్టరుగ, 2010లో డిఎస్పీగాను, 2021లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. విశాఖపట్నం సిటీ, విజయవాడ సిటీ, ఇంటిలిజెన్సు, ఉమ్మడి రాష్ట్రంలోని పోలీసు అకాడమీలోను, తెలంగాణ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించి, పోలీసు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందారు.

ఆర్మ్ రిజర్వు అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం.ఎం. సోల్మన్ ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ
ఆర్.శ్రీనివాసరావు, జిల్లా పోలీసు కార్యాలయ ఎఓ వెంకట రమణ, ఆరి పి.మరియన్ రాజు, కార్యాలయ పర్యవేక్షకులు ప్రభాకరరావు, కామేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పుష్ప గుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

పుంగనూరులో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్ ఖండించిన చంద్రబాబు

Satyam NEWS

కేసీఆర్ ను ఓడగొడితేనే ప్రజల సమస్యలకు పరిష్కారం

Satyam NEWS

రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం

Satyam NEWS

Leave a Comment