38.2 C
Hyderabad
May 3, 2024 22: 09 PM
Slider ఖమ్మం

విద్యార్థులకు ఆర్ధిక అక్షరాశ్యతపై అవగాహన

#Shravan Kumar Reddy

విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన పెంపొందించే ఉద్దేశ్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రవ్యాప్తంగా క్విజ్ నిర్వహించారని ఎస్బిఐ ప్రాంతీయ మేనేజర్ శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో 199 స్కూల్స్ నుండి విద్యార్థులను గుర్తించి, 14 కేంద్రాలలో క్విజ్ నిర్వహించామని ఆయన తెలిపారు.

క్విజ్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ఆయన ప్రదానం చేశారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు, జూలై 4 వ తేదీ జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్ మండల కేంద్రంలో నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎస్బిఐ ప్రాంతీయ మేనేజర్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఎస్బిఐ మేనేజర్లు చిట్టిబాబు, క్రాంతి, ఆయా పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

త్రిబుల్ ఆర్ లో ఉన్నవి మూడు పాటలేనా?

Satyam NEWS

విశాఖలో నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం

Satyam NEWS

ఎన్డీయే సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాణం

Bhavani

Leave a Comment