37.7 C
Hyderabad
May 4, 2024 12: 57 PM
Slider విజయనగరం

మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా” యాప్….!

#deepikaips

ఏపీలో గ‌తంలో “దిశ”ఏస్పీ  గా ప‌ని చేసి ప్ర‌స్తుతం విజయనగరం జిల్లా ఎస్పీ ఆధ్వ‌ర్యంలో…..

సద్వినియోగం చేసుకుంటే మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా (ఎస్.ఓ.ఎస్) యాప్” అని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక  అన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం, పోలీసుశాఖ పలు చర్యలు చేపడుతున్నప్పటికీ అవగాహనా రాహిత్యం కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రతీ మహిళ తమకు రక్షణగా నిలిచే చట్టాలు గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు, విద్యార్ధులకు చట్టాలు పట్ల, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధానం పట్ల, దిశా యాప్ ను ఉపయోగించి రక్షణ పొందడం పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ తరుపున చర్యలు చేపడుతున్నా మన్నారు.

ఇందులో భాగంగా మహిళా పోలీసులు (ఎం.ఎస్.పి.లు), మహిళా రక్షక్, పోలీసు అధికారులు, ఇతర పోలీసు సిబ్బంది తమ స్టేషను పరిధిలో ఉండే ఉన్నత పాఠశాలలు, కళాశాలలను విధిగా సందర్శించి, విద్యార్ధినులతో మమేకమై,

వారికి అర్ధమయ్యే రీతిలో మహిళల రక్షణకు బాసటగా నిలిచే చట్టాలు పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా, మహిళల స్మార్ట్ ఫోన్లులో దిశా ఎస్.ఓ.ఎస్. మొబైల్ యాప్ డౌన్లోడు చేయించి, రిజిస్ట్రేషను చేయించి, యాప్ ను ఎట్టి పరిస్థితుల్లోను డిలీట్ చెయ్యవద్దని కోరుతున్నామన్నారు.

యాప్ ను ఏకారణంతోనైనా డిలీట్ చేస్తే, వారు ఆపద సమయంలో ఉన్నపుడు దిశా ఎస్.ఓ.ఎస్. యాప్ తో పోలీసుల సహాయం పొందే వెసులుబాటును కోల్పోతారన్న విషయాన్ని గ్రహించాలన్నారు. మహిళలు రక్షణ, భద్రతకు దిశా యాప్ ఒక సాధనంగా, రక్షణ చక్రంగా ఉపయోగపడుతున్నదని, ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, దిశా ఎస్.ఓ.ఎస్. మొబైల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడు చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహిళలు, విద్యార్ధినులకు పిలుపునిచ్చారు.

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4,54,270 మందితో దిశా ఎస్.ఓ.ఎస్. యాప్ ను డౌన్లోడు చేయించి, రిజిస్ట్రేషన్స్ కూడా చేయించామన్నారు. ఇటీవల కాలంలో మహిళా పోలీసు సిబ్బంది 10రోజుల్లో 450 కి.మీ.ల దూరం మోటారు సైకిళ్ళుపై ప్రయాణించి, జిల్లాలో గుర్తించిన 23 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, స్థానిక పోలీసు అధికారుల సహకారంతో విద్యార్థినులను “దిశా జాగృతి యాత్ర”తో చైతన్యపర్చామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

దిశ యాప్ డౌన్లోడింగ్, రిజిస్ట్రేషన్స్ కు ప్రత్యేక డ్రైవ్..!

విజ‌య‌న‌గ‌రం  జిల్లా వ్యాప్తంగా ఈ నెల‌ 19న దిశ డౌన్లోడింగ్ మరియు రిజిస్ట్రేషన్స్ పెద్ద ఎత్తున చేపట్టేందుకుగాను ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ దీపికా తెలిపారు. మహిళల భద్రత, రక్షణ కొరకు ప్రత్యేకంగా రూపొందించిన దిశా యాప్ ను ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోనుల్లో డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ చేయించేందుకుగాను ప్రత్యేక డ్రైవ్ ను చేపడుతున్నామన్నారు.

ఈ డ్రైవ్లో జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న హెూంగార్డు నుండి జిల్లా ఎస్పీ స్థాయి వరకు అందరూ  పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పిస్తామ‌న్నారు. వారి వారి ఫోనుల్లో దిశ యాప్ ను   డౌన్లోడు, రిజిస్ట్రేషన్ చేయించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. కావున, ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ ప్రత్యేక డ్రైవ్ లో పాల్గొని, తమ మొబైల్స్ దిశ యాప్ను డౌన్లోడు, రిజిస్ట్రేషను చేసుకోవాలని, మహిళల భద్రతకు పోలీసుశాఖ చేపడుతున్న చర్యలకు తమవంతు సహకారాన్ని అందించాల్సిందిగా ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక పిలుపునిచ్చారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

Bhavani

అన్నవరం వన దుర్గమ్మ ఆలయం లో చండి హోమం

Satyam NEWS

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర?

Satyam NEWS

Leave a Comment