38.2 C
Hyderabad
May 5, 2024 22: 50 PM
Slider తూర్పుగోదావరి

అన్నవరం వన దుర్గమ్మ ఆలయం లో చండి హోమం

vanadurga

తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శ్రీ వన దుర్గమ్మ ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా వేద పండితులు ఆలయ అర్చకులు వేకువజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకముల పుష్పములతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

అనంతరం వేద పండితులు వ్రత పురోహితులు ఆలయ  అర్చకుడు చిట్టెం నగేష్ అమ్మవారికి శ్రీ సూక్తం పురుష సూక్తం మూల మంత్ర జపములు నిర్వహించి అనంతరం 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ చండి హోమంలో పాల్గొన్న కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులను భౌతిక  దూరం పాటించే విధంగా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.

హోమం నిర్వహించిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ హోమం కార్యక్రమంలో దేవస్థానం చెర్మాన్ ఐ వి రోహిత్ వేద పండితులు, ఆలయ అర్చకులు, వ్రత పురోహితులు, భక్తులు,  ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు  ఏఈవో ఎం కె టి ప్రసాద్, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విశాఖ ఆర్కే బీచ్ లో పోర్ట్ ట్ర‌స్ట్ ,డీసీఐ సంయుక్తంగా పూడిక ప‌నులు

Satyam NEWS

అభివృద్ధికి ఆదర్శంగా ఆదర్శంగా నిలవడమే ధ్యేయం

Satyam NEWS

క్వారంటైన్ కు చేరుకున్న కువైట్ ప్రవాసాంధ్రులు

Satyam NEWS

Leave a Comment