40.2 C
Hyderabad
May 5, 2024 18: 36 PM
Slider ముఖ్యంశాలు

చెరువులను సంరక్షిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.!

#snehachita

ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు..స‌మాజ పరంగా భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌పడే  మంచి ప‌నులు చేస్తున్న ప్ర‌ముఖ స్వ‌చ్చంద సంస్థ స్నేహ‌చిత్ర ఫౌండేష‌న్ మ‌రో వ్యూహాత్మ‌క‌మైన బృహ‌త్త‌ర మైన కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. అదే చెరువులను సంరక్షిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.! భూగర్భ జలాలను విరివిగా వాడేస్తున్నాం కానీ అంతకంటే ముందు భూమిలోకి నీటిని పంపుతున్నామా…? ఆలోచించండంటూ ఓ స‌మాచారాన్ని మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆలోచించ చేసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. కరువు కాటకాలు వంటి ఇబ్బందులోచ్చినపుడు ఇంకుడు గుంతల గురించి మాట్లాడతాం…కానీ ప్రతి గ్రామానికి పెద్ద చెరువుని మించిన ఇంకుడుగుంత ఇంకేమైనా ఉంటుందా…?ఆలోచించండి.! అంటూ పౌండేష‌న్ ప్ర‌శ్నించింది.

జనాభా పెరిగి పోతున్నారని,స్వార్థ ప్రయోజనాల కోసమని  చెరువులను కబ్జా చేసి, పూడ్చేసి పెద్ద పెద్ద మేడలు కట్టేస్తే చివరికి తాగడానికి గుక్కెడు నీళ్ళు లేని పరిస్థితులొస్తే ఆ పాపం ఎవరిది …? ఆలోచించండి!.

చెరువుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం  చూపించడం…

“చెరపకురా చెడేవు” లాంటిది.!

చెరువులు తరతరాల వారసత్వ సంపద.!

సంరక్షించు కోకుంటే వస్తుంది ఆపద.!!

నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం.!

సాగునీటి పధకాలపట్ల అలక్ష్యం.!!

దేశానికి తెస్తుంది దుర్భిక్షం.!!!  అంటూ  స్నేహ చైత్ర ఫౌండేషన్ చైర్మ‌న్  మరి శర్ల కృష్ణమూర్తి నాయుడు స‌మాచారం ఇచ్చారు.

Related posts

గ్లిట్టరింగ్: నిర్మల్ పట్టణానికి ఎల్ఈడి వెలుగులు

Satyam NEWS

కడప నగరంలో ప్రముఖ అడ్వకేట్ ఆత్మహత్య

Satyam NEWS

కారు-బైక్ ఢీకొని ఐదుగురు మృతి

Satyam NEWS

Leave a Comment