33.2 C
Hyderabad
May 4, 2024 00: 12 AM
Slider మహబూబ్ నగర్

బాటసారి ఫౌండేషన్ ఆధ్యర్యంలో పుస్త‌కాలు

Books

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలంలోని ఆముదం బండ గ్రామ పంచాయతీ పరిధిలో గార్ల బండ తాండలో 60 మంది బాలబాలికలకు బాలలకథలు, వ్యాసపుస్తకాలు, కవితాపుస్తకాలు, జీవిత చరిత్ర బాల గేయాలు, పద్య శతకాలు మొదలైన పుస్తకాలను పంపిణీ చేశారు.

లాక్ డౌన్ సమయాన్నిసద్వినియోగం చేసుకోవడానికి బాటసారి ఫౌండేషన్ తాండలు, గ్రామాలు తిరిగి బేటీ బచావో బేటీ పడావో నినాదంతో బాల్య వివాహాలు అనర్థాలు, ఆడ పిల్లల చదువు ఆవశ్యకత చదువు ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ కై సదస్సులు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. పుస్తకాలు పిల్లల మనో వికసానికి, భవిష్యత్తుకు పునాదిరాళ్లని ప్ర‌ధానోపాధ్యాయుడు తెలిపారు.
అనంత‌రం పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. యువత సెల్ ఫోన్లు వదలాల‌ని, పుస్తకాలు చ‌ద‌వాల‌ని ఉపాధ్యాయుడు మాసయ్య సూచించారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి సఖీ కేంద్రం సభ్యులు గిరిజ, శిరీన్, కౌన్సిలింగ్ శైలజా, ఆముదం బండ తాండ ఉప సర్పంచ్ దేవేజ, పాఠశాల హెడ్ మాస్టర్ అమీన్ రెడ్డి, ఆముదం బండ తాండ హెడ్ మాస్టర్ భాస్కర్, ఉపాధ్యాయులు మధు, బాటసారి ఫౌండేషన్ సభ్యులు గురువు మాసయ్య, రాజు, నర్సింహా, ఎల్ల స్వామి గిరిజన నాయకులు తాండ గిరిజనులు పాల్గొన్నారు.

Related posts

వెరైటీ:ఇతడు లారీలు బస్సులు దోచుకుపోతాడు

Satyam NEWS

స్లేవరీ:9 నెలలుగా జీతం లేక ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Satyam NEWS

చట్టసభల నిర్వహణ కత్తిమీద సాము

Satyam NEWS

Leave a Comment