27.7 C
Hyderabad
April 26, 2024 05: 56 AM
Slider తెలంగాణ

చట్టసభల నిర్వహణ కత్తిమీద సాము

pjimage (6)

130 కోట్ల మంది దేశ ప్రజలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశ ప్రజలకు మరింత మెరుగైన పాలన, సంక్షేమం‌, అభివృద్ధి కొరకు తీసుకోవాలసిన అంశాలపై నిర్ణయాత్మక చర్చలు జరిగేది చట్టసభలలోనే. తమ మేలు కోసం చట్టసభలలో జరిగే చర్చలపై దేశ ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న చట్టసభల సమావేశాలలో ఒక్క నిమిషం, ఒక్క పదం కూడా వృదా కారాదు అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ప్రధాన కమిటీ సమావేశ హాల్‌లో జరిగిన దేశంలోని అన్ని రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో  పాల్గొన్న రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. ఈ సమావేశంలో శాసనసభ కార్యదర్శి  డా.నరసింహా చార్యులు కూడా పాల్గొన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఆ అంశం పరిదిలోనే ఉండాలి. అంతేకానీ చర్చ పక్కదారి పట్టకూడదు. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో సమయం వృదా అవుతుంది. చట్టసభలలో అల్లరి చేయడం ద్వారా మీడియాను ఆకర్షించేందుకు కొంతమంది సభ్యులు ప్రయత్నం చేయడం దురదృష్టం, దీనిని కట్టడి చేయాలి.  అప్పుడ అర్ధవంతమైన చర్చలు జరుగుతాయి. తెలంగాణ శాసనసభలో రోజుకు 10 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ అవర్ ఉన్నది. ఇటువంటి సమావేశాలు మరిన్నీ జరగడం ద్వారా మెరుగైన ఫలితాలు సాదించవచ్చు. అయితే సమావేశ అజెండా, సమస్యలపై సూచనల కొరకు ముందస్తుగానే సమాచారం అందిస్తే సభ్యులు మెరుగైన పరిష్కారాలతో హాజరవుతారని పోచారం  సూచించారు.

Related posts

సంచలనం సృష్టించిన గంధం చంద్రుడు…. విశాఖ పోస్టింగ్

Satyam NEWS

వెల్ఫేర్ విభాగాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ నర్మద

Satyam NEWS

నో రెన్యూవల్: హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరించబోము

Satyam NEWS

Leave a Comment