38.2 C
Hyderabad
May 2, 2024 22: 41 PM
Slider విజయనగరం

ఒంటిగంట తర్వాత రోడ్లపై ఏ ఒక్కరూ సంచరించొద్దు…!

#vijayanagarampolice

కొత్త ఏడాది వేళ…విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఆంక్షలు విధించారు. అదీ 31 రాత్రి ఒంటి గంట తర్వాత ఏ ఒక్కరూ రోడ్ పై ఉండొద్దని ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు డీపీఓలో సిబ్బంది తో జరిగిన నేర సమీక్ష సమావేశం లో పై విధంగా సిబ్బంది కి చెప్పారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక, జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసుల సమిష్టి కృషి ఫలితంగా గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందన్నారు. సంక్రాంతి పండగ వస్తున్న నేపథ్యంలో పేకాట, కోడి పందాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించి, దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై జరిగి దాడులు నియంత్రించడంలోను, లోక్ అదాలత్ లో ప్రత్యేక ప్రణాళికతో పని చేసి, ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయడంలో సఫలమయ్యామన్నారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని దాదాపు అన్ని రహదారుల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించామని, ఇదే స్ఫూర్తితో నూతన సంవత్సరంలో పని చేసి, రోడ్డు ప్రమాదాలను మరింత తగ్గించేందుకు పని చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎన్ఫోర్సుమెంటు కేసులను మరిన్ని నమోదు చేయాలని, గంజాయి రవాణ, వినియోగంపై కేసులు నమోదు చేయాలన్నారు.

రాత్రి పెట్రోలింగ్ ఎక్కువ చేస్తాం

రాత్రి బీటు విధానాన్ని, పెట్రోలింగును మరింత పటిష్టంగా అమలు చేయాలని, తాళాలు వేసి ఉన్న ఇండ్లపైన, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపైన ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సైబరు నేరాల పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, దర్యాప్తులో ఉన్న కేసుల్లో నిందితులను అరెస్టు చేసి, వారిపై అభియోగ పత్రాలు దాఖలు చేయాలని, సైబరు నిపుణులు సూచనలు పాటించాలన్నారు.

సారా ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సారా తయారీ, రవాణ, వినియోగదారుల్లో పరివర్తన తీసుకొని వచ్చే విధంగా పని చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రతీ ఒక్కరూ హృద్రోగ పరీక్షలు చేయించుకొనే విధంగా చర్యలు చేపట్టనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

పోలీసు స్టేషనుకు వచ్చే వృద్ధులు, మహిళలు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, రిసెప్షన్ విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి త్వరలో ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల్లో ప్రాసిక్యూషన్ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయించి, నిందితులు త్వరితగతిన శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలు నిబంధనలు అనుగుణంగా నిర్వహించుకొనే విధంగా చూడాలని, రాత్రి 1గంట తరువాత ఎవ్వరిని రోడ్ల మీదకు అనుమతించవద్దని శాఖ సిబ్బంది కి జిల్లా ఎస్పీ ఆదేశించారు. గత ఏడాది దర్యాప్తులో ఉన్న కేసుల్లో వేగవంతంగా ఎక్కువ కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసినందుకు, లోక్ అదాలత్ కేసులు ఎక్కువగా డిస్పోజ్ చేసినందుకు, ఆస్తికి సంబంధించిన కేసులను ఎక్కువగా చేధించినందుకు, అత్యధికంగా ఎం. వి. కేసులు, ఓపెన్ డ్రింకింగ్, డ్రంకన్డ్రై వ్, డిసిఆర్బి, స్పెషల్ బ్రాంచ్ సమర్ధవంగా పని చేసిన అధికారులుకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రోత్సాహక బహుమతులను, డైరీలను, ప్రశంసా పత్రాలను అందజేసారు.

ఈ సమీక్షా సమావేశంలో విజయనగరం ఇన్ చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ బి. మోహన రావు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, న్యాయ సలహాదారులు వై. పరశురాం, సిఐలు జె. మురళి, జి. రాంబాబు, బి. వెంకట రావు, ఎస్.బాల సూర్యారావు, విజయనాధ్, ఎల్. అప్పలనాయుడు, ఎం.నాగేశ్వరరావు, సింహాద్రి నాయుడు, రవి కుమార్, నవీన్ కుమార్, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

Homework seems to get been a part of school lifespan because the beginning

Bhavani

లొంగిపోయిన న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు

Satyam NEWS

మళ్లీ ముంచుకొస్తున్న మహమ్మారీ: భారీగా కరోనా కేసులు

Bhavani

Leave a Comment