33.7 C
Hyderabad
April 29, 2024 00: 33 AM
Slider వరంగల్

లొంగిపోయిన న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు

#Janashakthi Leaders

సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్ ఏరియా డివిజినల్ కార్యరద్శి సోమ భాస్కర్ ఆలియాస్ సూర్యంతో పాటు మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ప్రతాప్ అలియాస్ శ్యాం గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ ఎదుట లొంగిపోయారు.

పోలీసుల ఎదుట లొంగపోయిన సోమ భాస్కర్ ఆలియాస్ సూర్యం నర్సంపేట పట్టణంలో ఇంటర్ ఐటీఐ పూర్తి చేసాడు. ఉన్నత పాఠశాలలో చదువు సమయంలోనే విప్లవ భావాజాలం కలిగివుండటంతో అప్పటి పి.డి.యస్.యూ నాయకుడు జిగట ప్రభాకర్ ఉపన్యాసాలు, పాటలకు ఆకర్షితుడైన సూర్యం 1992 సంవత్సరంలో న్యూడెమోక్రసీ పార్టీకి సానుభూతిపరుడిగా పనిచేశాడు.

1998 నుంచి అజ్ఞాతంలో ఉన్న సూర్యం

1995 సంవత్సరం నుండి పి.డి.యస్.యూ పార్టీ పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించిన సూర్యం 1998 సంవత్సరంలో కొత్తగూడెం ఏరియా న్యూడెమోక్రసీ పార్టీ డివిజినల్ సభ్యుడిగా పనిచేస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 2003 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఇదే సంవత్సరంలో రోళ్ళ గడ్డ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో దళకమాండర్ చెర్ప శ్రీనివాస్ చనిపోవడంతో పార్టీ నాయకత్వం సూర్యాన్ని దళ నాయకుడిగా బాధ్యతలు అప్పగించారు.

దళ సభ్యుడిగా భాధ్యతలు చేపట్టిన నాటి నుండి 2013 సంవత్సరం వరకు పార్టీలో కీలకంగా పనిచేసాడు. 2013 సంవత్సరంలో న్యూడెమోక్రసీ పార్టీలో అంశత విభేదాలు రావడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో సూర్యం న్యూడెమోక్రసీ రెండవ వర్గానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు, 2013 సంవత్సరంలో డి.సి.యంగా బాధ్యతలు చేపట్టాడు.

సూర్యంపై 12 కేసులు పెండింగ్

2015లో జిల్లా డి.సి.ఎస్ గాను, 2016 సంవత్సరంలో జిల్లాల విభజన అనంతరం మహబూబాబాద్ జిల్లా న్యూ న్యూడెమోసీ డి.సి.ఎస్, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2006సంవత్సరంలో కొత్తగూడ మండలం ఇసుకమీద గుట్ట వద్ద న్యూ న్యూడెమోక్రసీ సభ్యులు పోలీసులపై జరిపిన కాల్పులు కానిస్టేబులకు గాయపడిన సంఘటనతో పాటు, అక్రమ వసూళ్ళు మరియు బెదిరింపులకు పాల్పడంతో సూర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.

సానుభూతి పరుడుగా ఉంటూ పార్టీలోకి

బుర్క ప్రతాప్ ఆలియస్ శ్యాం పూర్తి వివరాల విషయానికి వస్తే న్యూ డెమోక్రసీ దళనాయకుడు సూర్యం తరచు బుర్మప్రతాప్ ఇంటికి వస్తుపోతున్న క్రమంలో ప్రతాప్ కుటుంబ సభ్యులతో పాటు ప్రతాప్ సైతం న్యూ డెమోక్రసీ పార్టీకి సానుభూతిపరులు పనిచేసారు.

సూర్యం ప్రోత్సహంతో ప్రతాప్ 2005 సంవత్సరంలో దళ సభ్యుడిగా పార్టీలో చేరి కోద్ది కాలం పనిచేసిన అనంతరం ప్రతాప్ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా సూర్యంతో కల్సి పనిచేశాడు. 2010 సంవత్సరంలో దళ సభ్యురాలైన నార్ల మమతను వివాహం చేసుకున్నాడు.

సూర్యంతోనే కలిసి పని చేసిన ప్రతాప్

2013లో పార్టీలో చీలిక అనంతరం కూడా ప్రతాప్ సూర్యంతో కలిసి పనిచేస్తునే నూతన జిల్లా ఆవిర్భావం అనంతరం కొత్తకూడ మండల కార్యదర్శిగా, మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2016 సంవత్సరంలో పోలీసుల చిక్కి 46రోజుల జైలు జీవితం అనంతరం జైలు నుండి విడుదలయి తిరిగి 2018 సంవత్సరంలో సూర్యంతో కల్సి పనిచేసాడు.

ఇతను మొత్తం పది నేరాలకు పాల్పడ్డాడు. ఈ సమావేశంలో అదనపు డి.సి.పి తిరుపతి, వెంకటలక్ష్మీ నర్సంపేట ఎ.సి.పి ఫణీందర్, నర్సంపేట పట్టణ ఇన్స్ స్పెక్టర్ కరుణాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

కరోనాపై పోరాడుతున్న జర్నలిస్టులకు సన్మానం

Satyam NEWS

కొరకరాని కొయ్య: జగన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ గా మారిన కోటంరెడ్డి

Satyam NEWS

శ్రీశైలానికి భారీగా చేరుతున్న వరద నీరు

Satyam NEWS

Leave a Comment