41.2 C
Hyderabad
May 4, 2024 16: 44 PM
Slider హైదరాబాద్

కేంద్రం, రాష్ర్ట ప్ర‌భుత్వాలు దొందూ దొందే!

jeevan reddy1

ప్రజలకు మేలు చేసే పలు పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంద‌ని, అలాగే కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం రైతుల‌ప‌ట్ల క‌నిక‌రం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ఈ విధంగా ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష ధోరణితో దొందూ-దొందుగా వ్యవహరిస్తున్నాయ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవ‌న్‌రెడ్డి ఆరోపించారు.

అసెంబ్లీలోని మీడియా పాయింట్ వ‌ద్ద శుక్ర‌వారం జీవ‌న్‌రెడ్డి విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

ఆయుష్మాన్ భార‌త్‌లో రెండేళ్ళు కాల‌యాప‌నెందుకు? టి. జీవ‌న్‌రెడ్డి

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం అమలు నెపంతో పేదవారికి ఎంతో మేలుచేసే కేంద్ర ప్రభుత్వం వారి “ఆయుష్మాన్ భారత్” పథకాన్ని అమలు చేసే విషయంలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వం రెండేళ్లు కాలయాపన చేసిందేందుకని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకాన్నికూడా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది, కనీసం ఇంత కాలనికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచినందుకు సంతోష‌క‌ర‌మ‌న్నారు.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై టీఆర్ఎస్ అత్యుత్సాహం

కానీ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేసే విషయంలో మాత్రం రాష్ర్టంలోని ప్రభుత్వం అత్యుత్సాహం ఎందుకు చూపుతోందో అర్థం కావ‌డం లేద‌న్నారు. అగ్రవర్ణ పేదల కోసం ews అమలు చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచిందా? ఇన్ని రోజులు ఏం చేసింది ఇదంతా రానున్న కార్పొరేష‌న్‌, అసెంబ్లీ, ఎమ్మెల్సీల ఎన్నిక‌ల‌ను ద్ర‌ష్టిలో ఉంచుకొనే చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రిజర్వేషన్ అమలు జరిపే విషయంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వారి అలసత్వం కారణంగా గిరిజనులకు తీవ్రమైన నష్టం జరిగింద‌ని వాపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మొత్తం జనాభా లో 6 శాతం గిరిజన జనాభా ఉండేది. ఆ మేరకు వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలో రిజ‌ర్వేష‌న్లు అమలు చేసేవార‌న్నారు. అదే విధంగా దేశ జనాభా మొత్తంలో 7.5% శాతం మేర గిరిజనులు ఉన్నారని నిర్దారణ అయిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. మ‌రీ వారి రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో ఏ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయో ప్ర‌జ‌ల‌కు తెలిసేలా వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు.

4 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను న‌ష్ట‌పోతున్నగిరిజ‌నులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర జనాభాలో గిరిజనుల జనాభా 10% శాతంగా స్థిరీకరించార‌న్నారు. కానీ ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 6% శాతం రిజ‌ర్వేష‌న్లే అమ‌ల‌వుతుండ‌డం దేనికి సంకేత‌మ‌ని ప్ర‌శ్నించారు. దీనివలన గిరిజనులు 4 శాతం మేర రిజ‌ర్వేష‌న్‌ అమలును నష్టపోతున్నార‌న్నారు. ఉదాహరణకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 840 మంది గిరిజనులు వైద్య విద్యను అభ్యసించే అవకాశాలను కోల్పోయార‌ని, గిరిజన రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాల్సిన బాధ్యత రాష్ర్టంలోని టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఉంటే, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీన‌మేషాలు లెక్కిస్తూ గిరిజ‌నుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. చరిత్రలో సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేటీఆర్ బెట‌ర్ సీఎం అంటే… కేసీఆర్ ఫేయిల్ సీఎం?!

గిరిజనులకు రిజర్వేషన్ ప్రకారం దక్కాల్సిన ఉద్యోగాలు దక్కలేద‌ని, రాజ్యాంగ నిబంధన ఉల్లంగిస్తున్నార‌ని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం పై ఎవ‌రూ కూడా అభ్యంతరం చెప్పమ‌ని, చెప్ప‌లేద‌ని, వెంటనే రిజ‌ర్వేష‌న్‌ల అమలుపై ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలిల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో కేసీఆర్‌కు చేత కావ‌డం లేదా? కేటీఆర్ బెటర్ సీఎం ఐతడు అని అనడం అంటే… కేసీఆర్ ఫెయిల్ అని ఒప్పుకుంటున్న‌ట్లే క‌దా! అని ఆయ‌న అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కేసీఆర్ చేసింది చాలు అనే అభిప్రాయంతో ఉన్నార‌ని ఔరంగజేబు పాలన కావలనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు.

Related posts

ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్న నిమ్మగడ్డ

Satyam NEWS

ఇన్స్పైర్-మానక్ రాష్ట్ర స్దాయి ప్రదర్శన ప్రారంభం

Satyam NEWS

మిస్ యూజ్: పబ్లిక్ ఏమైతేనేం, ముందు నా ఇల్లు చల్లగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment