42.2 C
Hyderabad
April 26, 2024 15: 41 PM
Slider మహబూబ్ నగర్

మిస్ యూజ్: పబ్లిక్ ఏమైతేనేం, ముందు నా ఇల్లు చల్లగా ఉండాలి

#Kollapur Municipality New

మునిసిపల్ చైర్మన్ గా గెలిచిన తర్వాత ఏం చేయాలి? ఏం భయ్ అది కూడా తెల్వదా? మున్సిపాల్టీలో చాలా మంది వర్కర్లు ఉంటారు వారిని మన ఇంట్లో పని చేయించుకోవాలి. అంతే. సింపుల్. అర్థమైందా? ఇంతే సింపుల్ గా పని చేస్తున్నారు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మునిసిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి.

కొల్లాపూర్ 20వ వార్డు నుంచి విజయలక్ష్మి కౌన్సిలర్ గా గెలిచారు. అదే వార్డులో ఆమె నివాసం ఉంటారు. మంచిదే కదా అనుకుంటున్నారా? ఆమె కూడా అలానే అనుకుని ఆ ఇంటిపైన కొత్త నిర్మాణం చేపట్టారు. ఈ కొత్త నిర్మాణానికి మునిసిపాలిటీలో పని చేసే కార్మికుల్ని వాడేసుకుంటున్నారు.

మీ పనివత్తిడితో నాకేం పని?

కరోనా వైరస్ నేపథ్యంలో మునిసిపాలిటీ కార్మికులు, పారిశుద్ధ్య పనివారు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. వీధుల్ని పరిశుభ్రంగా ఉంచడం, చెత్త క్లీన్ చేయడం, చెత్త ఎప్పటికప్పుడు బయటకు తరలించడం, మురుగు కాల్వలు శుభ్రం చేయడం లాంటి పనులతో బాటు పోలీసులు సాయం అడిగితే చేయడం, వైద్యులకు సహాయం చేయడం లాంటి కార్యక్రమాలతో ఎంతో పనివత్తిడిలో ఉన్నారు.

మీ పని వత్తిడితో నాకేం పని అని ప్రశ్నిస్తున్నట్లుగా మున్సిపల్ చైర్ పర్సన్ తన ఇంట్లో పనులు చేయించుకుంటున్నారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు గడవ లేదు. అప్పుడే అధికార అహంకారం ఎలా ఉంటుందో కొల్లాపూర్ ప్రజలకు రుచి చూపిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ తతంగం సాగుతున్నది.

దీనికి సంబంధించిన ఫొటో బయటకు రాగానే జాగ్రత్త పడ్డారు. మునిసిపల్ కార్మికులను మేం వాడుకోవడం లేదు అని చెప్పేందుకు తంటాలు పడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ పని చేసిన మునిసిపల్ కార్మికులకే కాకుండా కొల్లాపూర్  మునిసిపల్ సిబ్బంది అందరికి ఈ విషయం తెలుసు.

పదవి భార్యది పెత్తనం భర్తది

కొల్లాపూర్ లో అధికారం మొత్తం చైర్మన్ భర్తదే నడుస్తుంటుంది. ఇప్పటికే ఆయనపై కొంత మంది కౌన్సిలర్స్ ఫిర్యాదు చేశారు కూడా. అయినా దౌర్జన్యాలు ఆగలేదు. మునిసిపల్ వర్కర్లను ఈ విధంగా వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటున్న మునిసిపల్ చైర్ పర్సన్ విషయంలో తక్షణమే మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించాలని 6వ వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలపై వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

మున్సిపల్ చైర్ పర్సన్ ను సస్పెండ్ చేయాలి

ఈ సంక్లిష్ట సమయంలో మునిసిపల్ కార్మికులను సొంత పనులకు వాడుకుంటున్న మున్సిపల్ చైర్ పర్సన్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని 10 వార్డు కౌన్సిలర్  షేక్ రహీం పాషా డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న చైర్మన్ భర్త పై  చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Related posts

మజ్లీస్ ఎమ్మెల్యే అనుచరుడిని ఎందుకు అరెస్టు చేయలేదు?

Satyam NEWS

జులై 20.. ‘బాలు’ గారి ఫోన్…

Satyam NEWS

నీట్, ఐఐటీ-జేఈఈ ఫోరం హెల్ప్ లైన్ @ 90525 16661

Satyam NEWS

Leave a Comment