రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధికి బ్రాహ్మణ కులం అంటే ఎంత చులకన భావమో వెల్లడించే సంఘటన ఇది. ఇలాగే ఇతర కులాను అణచివేసిన విధానం వల్లే తెలుగుదేశం పార్టీపై కమ్మ కుల ముద్ర వచ్చి ఆ పార్టీ 23 స్థానాలకు పరిమితం అయింది.
అయినా ఆ పార్టీ వారికి బ్రాహ్మణ ద్వేషం తగ్గలేదు. ఓ చానల్ డిబేట్ లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కి విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ కి నిన్న రాత్రి వాగ్వాదం జరిగింది. ఆమె జగన్ ను ప్రతి శుక్రవారం జైలుకు వెళ్లివస్తాడు అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కి సంబంధించి అంత అగౌరవంగా మాట్లాడవద్దని విష్ణు హెచ్చరించారు. దాంతో ఇద్దరికి వాగ్వాదం పెరిగింది.
ఇవన్నీ రాజకీయాలకు సంబంధించిన విషయాలు. వారు ఎలా కొట్టుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండదు. అది ఆ రెండు పార్టీలకూ డిబేట్ నిర్వహించిన ఛానెల్ కు చూసే ప్రేక్షకులకు సంబంధించిన అంశం. అలానే అందరూ అనుకుంటున్న సమయంలో అనురాధ బ్రాహ్మణ కుల ప్రస్తావన తీసుకువచ్చారు. సంభాషణలో విష్ణుని ఉద్దేశించి ఆమె నీ బ్రాహ్మణ సంఘం చేత అంటూ కుల ప్రస్తావన తీసుకువచ్చి సభ్య సమాజం అసహ్యించుకునేలా ప్రవర్తించారు.
ఈ కుల దురహంకారం వల్లే తెలుగుదేశం పార్టీకి ఈ గతి పట్టిందని బ్రాహ్మణ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అనురాధ చేసిన వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్నాయి. సదరు నాయకురాలు ఆ సమయంలో కుల ప్రస్తావన తీసుకురావటం దేనికి? వ్యక్తిగతంగా కులంను ఉద్దేశించి మాట్లాడటం సరికాదని ఇకపై ఇలానే కులాల గురించి ప్రసావిస్తే భవిష్యత్ లో తగినంత మూల్యం తప్పదు అని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే, ఆయన కుల రాజకీయాలకు అతీతం అయితే అనురాధను పార్టీ నుంచి బహిష్కరించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.