38.2 C
Hyderabad
May 3, 2024 22: 55 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో పోర్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం

#MLA Kolagatla

రాష్ట్రంలో తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, కొత్త పోర్ట్ లు రావడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి అన్నారు. ఈ మేర‌కు విజయనగరం ఎమ్మెల్యే కోల‌గట్ల నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో  మాట్లాడారు.

ముందుగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ చైర్మన్ గా కాయల వెంకటరెడ్డి మారిటైమ్ బోర్డు చైర్మన్ గా నియమితులు కావడం తనకు వ్యక్తిగతంగా సంతోషంగా ఉందన్నారు. జిల్లా కోటాలో సమర్థవంతమైన నాయకుడికి పదవి ఇవ్వడం చాలా సంతోషం అన్నారు.

కె.వి.ఆర్ ఎస్టేట్, కె వి ఆర్ గ్రూప్  పేరిట వ్యాపారాలు చేస్తూ, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. పుట్టినది తూర్పుగోదావరి జిల్లా అయిన వ్యాపార రీత్యా జిల్లా ప్రజలతో మమేకమయారని అన్నారు.

గత ఏడాది కరోనా మొదటి వేవ్ లో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టవంతం చేయాలన్నారు.

సీఎం జ‌గ‌న్ కూడా ఏరి కోరి చైర్మన్ గా నియమించడం పట్ల చైర్మన్ కాయల వెంకటరెడ్డికి మరింత బాధ్యత పెరిగిందన్నారు.అనంత‌రం  చైర్మన్ కాయల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్  నమ్మకంతో తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానన్నారు.

తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అని అన్నారు. విజయనగరం జిల్లా కోటా లో తనకి పదవి రావడం పట్ల మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1981 వ సంవత్సరం నుంచి తనకు జిల్లాతో అనుబంధం ఉంద‌ని…. తన తాతగారు ఈ జిల్లాలోని మామిడి కాయల వ్యాపారం చేసే వారని తెలిపారు.

1998 సంవత్సరం నుంచి తాను జిల్లాలో పెట్రోల్ బంక్ వ్యాపారం ప్రారంభించాన‌ని…. అప్పటి నుంచి  రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలలో వ్యాపారాన్ని ప్రారంభించామన్నారు. వెనుకబడిన జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సహకారంతో కృషి చేస్తానన్నారు.

రాష్ట్రంలో 975 తీరప్రాంతాలు ఉన్నాయ‌ని… 14 మైనర్, మేజర్ పోర్టు ఉన్నాయన్నారు.. భావనపాడు పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందన్నారు. కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. తీర ప్రాంతాలలో మత్స్యకారుల కోసం కొత్త జెట్టీ లను  ఏర్పాటు చేస్తామని తెలిపారు.

భీమిలి దగ్గర  జెట్టి నిర్మాణంతో పాటు, చింతపల్లి ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు  కృషి చేస్తామన్నారు. పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కె.వి.ఆర్ అభిమానులు చైర్మన్ కాయల వెంకటరెడ్డి కి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి నీ దర్శించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

చైర్మన్ రాకతో ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు కాయల వెంకటరెడ్డికి ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.

Related posts

Big News: గాలి నాణ్యత తగ్గడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

Satyam NEWS

కాశ్మీరేతరులను హతమారుస్తున్న ఉగ్రవాదులు

Satyam NEWS

షర్మిలకు మోదీ ఫోన్: మండిపడుతున్న జనసేన

Satyam NEWS

Leave a Comment