30.7 C
Hyderabad
May 5, 2024 05: 46 AM
Slider ముఖ్యంశాలు

సునీల్ కుమార్ పై చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం

#pvsunilkumar

అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికలో డీజీపీ పీవీ సునీల్‍కుమార్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలపాలని కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఐపిఎస్ అధికారి అయిన సునీల్ కుమార్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రసంగించారని నర్సాపురం పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుకు ఆధారంగా సునీల్ కుమార్ చేసిన ప్రసంగం వీడియోలను కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ఫిర్యాదు పై చర్యలు తీసుకుని నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. పీవీ సునీల్ కుమార్ ఇటీవలి కాలం వరకూ ఎపి సీబీసీఐడి అధిపతిగా పని చేశారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఆయనను ఆ పదవి నుంచి ఆకస్మికంగా తొలగించింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయమని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం విచారణకు ఆదేశించడం ఆసక్తి కలిగిస్తున్నది.

Related posts

చంద్రబాబు, లోకేష్‌ భద్రతకి ముప్పు..?

Bhavani

కోటయ్య మృతి:ఆనంద‌య్య మందుకు ప్రభుత్వ అనుమతి

Satyam NEWS

వృధ్ధురాలి హత్యకేసు ఛేదించిన పార్వతీపురం పోలీసులు

Satyam NEWS

Leave a Comment