28.7 C
Hyderabad
May 5, 2024 07: 28 AM
Slider పశ్చిమగోదావరి

ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు పరీక్షలు

#pregnant women

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కె గోకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో ప్రతి నెల 9వ తేదీన ప్రధాన మంత్రి మాతృత్వ సంరక్షణ అభియాన్ ఆరోగ్య పథకం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి గర్భిణీలు పాటించవలసిన ఆరోగ్య నియమాలు, తీసుకోవలసిన పౌష్టికాహార వివరాలు పి హెచ్ సి వైద్యాధికారి కృష్ణ కిషోర్

తెలియజేసారు. గర్భిణీలకు అవసరాన్ని బట్టి ఐరన్ మాత్రలు, ధనుర్వాతం రాకుండా అవసరమైన మందులు పంపిణీ చేస్తామని డాక్టర్ కృష్ణ కిషోర్ తెలిపారు. కె.గోకవరం పి హెచ్ సి లో నిర్వహిస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిని లింగపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎం డి ఓ) ఆశీర్వాదం గురువారం పరిశీలించారు.

కె గోకవరం పి హెచ్ సి వైద్యాధికారి కృష్ణ కిషోర్, హెల్త్ సూపర్ వైజర్ ఉమా మహేశ్వరరావు, హెచ్ వి రాణి మండల పరిధి గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న ఏ ఎన్ ఎం ల పనితీరును ఎం పి డి ఓ ఆశీర్వాదం అభినందించారు.

Related posts

ఫలక్ నుమా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నోట్ బుక్స్ పంపిణీ

Satyam NEWS

Ballot Battle: పెట్రో మంటలు… సాగు చట్టాలు…

Satyam NEWS

పవన్ కల్యాణ్ పై గుర్తు తెలియని వ్యక్తుల నిఘా

Satyam NEWS

Leave a Comment