38.2 C
Hyderabad
May 3, 2024 21: 52 PM
Slider హైదరాబాద్

తెలంగాణ లో పెరిగిన కవులు, కళాకారుల ప్రాధాన్యత

#srinivasagupta

కేసీఆర్ సీఎం అయిన తర్వాత  కవులు, కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో కనక దుర్గ నృత్య విభావరి 41వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన భరత నాట్య ప్రదర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత  కవులు, కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. రచయితలకు, గాయకులకు, కవులు, కళాకారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక  ప్రభుత్వం కేసీఆర్  ప్రభుత్వం అని అన్నారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు తెలంగాణ  కవులు, కళాకారులను కళారంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని  అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ యాస కు భాష కు ప్రాధాన్యం పెరిగింది. కవులు, కళాకారులు అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దాదాపు1200 మంది కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని అన్నారు. దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, గోరటి వెంకన్న లాంటి వారికి పదవులు ఇచ్చి గౌరవించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జి. వెంకట్ రెడ్డి, డా. మహమ్మద్ రఫీ,  వనజ ఉదయ్, పండిట్ అంజిబాబు, డా. కుసుమ భోగరాజు, రెహనా ఖాన్, లయన్ నిర్మలా ప్రభాకర్, గాయనీ, గాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ నెల 28న భద్రాచలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Murali Krishna

‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ 18న విడుదల

Bhavani

కష్టపడి పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఎలా?

Satyam NEWS

Leave a Comment