40.2 C
Hyderabad
April 28, 2024 16: 09 PM
Slider ప్రత్యేకం

పులివెందులలో జగన్ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏమిటో?!

#raghurama

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఓడిపోతే,  పార్టీ పరిస్థితి ఏమిటోనన్న ఆందోళన క్రమశిక్షణ కలిగిన  తనలాంటి కార్యకర్తలను వేధిస్తోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  కె. రఘురామకృష్ణంరాజు అన్నారు. పులివెందుల పులి రానున్న రోజుల్లో మ్యావ్ మ్యావ్ అనే పిల్లిగా  మారుతుందేమో… ఇప్పుడు గాండ్రించే పులి కాస్త, రేపు మ్యావ్… మ్యావ్ అంటుందేమో. వై నాట్ కుప్పం  అని పోలీసులను అడ్డం పెట్టుకొని తింగరి వేషాలు వేస్తే  తోలు తీసే పరిస్థితి వస్తుందని నిన్నటి పులివెందుల చంద్రబాబు సభ ద్వారా స్పష్టమయ్యింది.

వై నాట్ 175 అని కారు కూతలు కూసిన  బ్యాచ్ కు నిన్నటి టీజర్ తోనే  దిమ్మ తిరిగి  ఉంటుంది. టీజర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ముత్యాలముగ్గు చిత్రంలో  సంగీత మాదిరిగా మా పార్టీకి చెందిన ఎంపీ, పేరు చివరన రెండు అక్షరాలు ఉన్న నాయకులు  పసుపు నీళ్లతో పులివెందుల పూల అంగడికి   ప్రాంగణాన్ని కడిగారట అంటూ ఎద్దేవా చేశారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కడగటం అలవాటయిన వారు పులివెందుల పూల అంగడిని కూడా పసుపు నీళ్లతో కడిగారని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దీటైన సమాధానం ఇచ్చారు. కడప ఎంపీ  వైయస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి  మరి కొంతమంది శుద్ధి చేయడం ఎలాగో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు కూడా అదే పని చేశారని బీటెక్ రవి అన్నారని పేర్కొన్నారు.

పులివెందులలో పసుపు వాన  కురిసింది. పెద్దాయన ప్రసంగాన్ని ముగించి వెళ్ళబోతుంటే… వెళ్లడానికి వీలు లేదని  “సార్… ఫలానా కుర్రాడు వేసిన హత్య గురించి మాట్లాడండి… రక్తపు  మరకలను ఎలా కడిగారో చెప్పండి” అని అడిగి మరీ మాట్లాడించుకున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పులివెందుల పూల అంగడిలో పసుపు పచ్చ పూలు చల్లి, ఆ పూల పైనే  వాహనాలను నడిపించారు.  

స్థానిక ఎమ్మెల్యే పరదాలు కట్టుకొని, భారీకేడ్లు ఏర్పాటు చేసుకుని బితుకు బితుకుమంటూ పులివెందులకు వెళ్తుండగా, నిజమైన సింహంలా  షంషేర్ గా  వాహనం ఎక్కి చంద్రబాబు నాయుడు పులివెందులలో పులిలా ప్రవేశించారు. రేపు పులివెందుల పేరును  స్థానిక ఎమ్మెల్యే పిల్లివెందుల అని మార్చుకుంటే మంచిది. పులివెందులలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభకు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  రౌడీలు ఆటంకాన్ని కలిగిస్తారని  ముందే ఊహించాను.

అనుకున్నట్లుగానే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు వాహనాలకు జెండాలను కట్టుకొని సభా ప్రాంగణానికి విచ్చేసి అలజడి సృష్టించబోతే, స్థానికులు తరిమి,  తరిమి కొట్టిన సీన్ చూస్తే రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని  స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా ఒక సింహాన్ని తిరగబడి దుప్పి  తరిమికొట్టిన  వీడియోను మీడియా ప్రతినిధుల ముందు  రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు.

ఎక్కడైతే ప్రజల్లో చైతన్యం వచ్చిందో, అక్కడి ప్రజలే మీ ఉడుత ఊపులకిక భయపడి లేదని స్పష్టం చేశారు. ఇకపై పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చిడతలు వాయించినట్టు వాయిస్తామని  సంకేతాలను  ఇచ్చారు. ఒక సినిమాలో హీరో బాలకృష్ణ చెప్పినట్టుగా  నీ ఊరుకు వచ్చాను…  నీ ఇంటికి వచ్చాను అన్నట్లుగా చంద్రబాబు నాయుడు పులివెందులలో అడుగుపెట్టారు. పులివెందుల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

చంద్రబాబు నాయుడుని  జగన్మోహన్ రెడ్డి ముసలివాడు అని సంభోదిస్తున్నారు. కానీ ఆయనేమో అలవోకగా  రెండు మూడు అంతస్తుల బిల్డింగులను  ఎక్కుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులను తిరిగి  ఒక లెక్చరర్ మాదిరిగా ఈ ప్రభుత్వ హయాంలో  రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని  ప్రజలకు వివరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరిస్తుంటే, ప్రొఫెసర్లు సైతం  నివ్వరపోయే పరిస్థితి నెలకొంది. 

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని  ఆయన ఏకరువు పెడుతుండగా, మనము నాలుగు మాటలు మాట్లాడాలంటేనే  బ్బబ్బ.. బెబ్బే అంటామని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై  ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శల గురించి నీటిపారుదల శాఖ  మంత్రి మాట్లాడుతారేమోనని అనుకుంటే, ఆయనేమో బ్రో సినిమా హిట్ కాలేదు అని దీర్ఘాలు తీస్తున్నారు.

ప్రధాన ప్రతిపక్ష నేత నేమో  సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరిస్తూ ప్రజల మధ్యలోనే ఉంటూ, సభలను నిర్వహిస్తున్నారు. 32 ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులతో  శ్యాం బాబు కాదు, కాదు రాంబాబు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తారట. ఇటువంటి వారు ఫిర్యాదు చేయగానే  కం కంప్లైంట్ తీసుకుంటారా?, ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారు.

పులివెందుల ఎమ్మెల్యే బీటెక్ రవి అని నిర్ధారించుకున్న సీమ ప్రజలు

పులివెందుల కాబోయే ఎమ్మెల్యే  బీటెక్ రవి అని కడప జిల్లా ప్రజలే కాదు… రాయలసీమ ప్రజలు కూడా  నిర్ధారించుకున్నారు. పులివెందులలో ఆ జన ప్రభంజనం చూస్తే, బీటెక్ రవికి ఉన్న  ప్రజాదరణ ఏ పాటిదో అర్థమవుతుంది. పులివెందుల నిజమైన పులి బీటెక్ రవి. రాష్ట్రంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు  తిరుగుతుండగానే, మరొకవైపు ఎల్లుండి నుంచి  వారాహి వాహన దారుడై పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. నేను కూడా త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నాను. నన్ను కూడా దుప్పి అని అనుకుంటున్నారేమో, తిరగబడి సింహాన్ని కూడా పొడిచి వేయగలనని రఘు రామకృష్ణంరాజు హెచ్చరించారు.

Related posts

పూలవర్షం కాదు పూట గడవడంపై ఆలోచించండి

Satyam NEWS

దళితబంధు ప్రారంభించక పోతే చర్యలు

Murali Krishna

విద్యాసంవ‌త్స‌రాన్నికాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే

Sub Editor

Leave a Comment