31.7 C
Hyderabad
May 2, 2024 07: 44 AM
Slider ముఖ్యంశాలు

ఈ నెల 28న భద్రాచలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

#murmu

ఈ నెల 28వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటన సందర్భంగా అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లుపై కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన విధుల గురించి దిశానిర్ధేశం చేశారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రం చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. రహదారుల వెంబడి వ్యర్ధాలను తొలగించాలని చెప్పారు. ప్రసాదు పథకం ద్వారా చేపట్టనున్న పనులతో పాటు మహాబూబాబాద్, ఆసిఫాబాద్ లో నిర్మించిన ఏకలవ్య మోడల్ పాఠశాలలు, మిథాని పరిశ్రమను  వర్చువల్ ద్వారా  రాష్ట్రపతి ప్రారంభించనున్నట్లు చెప్పారు. అధికారులకు కేటాయించిన విధులను ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని ర.భ. అధికారులకు సూచించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. దేవస్థానంలో రైలింగ్, ర్యాంపు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. విధులు కేటాయించిన అధికారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

సబ్ కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూము ఏర్పాటు చేయాలని భద్రాచలం ఆర్డీఓకు సూచించారు. వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నందున ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయాలని ఈడియంకు సూచించారు. ఎస్పీ వినీత్ మాట్లాడుతూ కాన్వాయ్ వాహనాలను తనిఖీ చేయాలని ఆర్టీఓకు సూచించారు. ఆగిపోయిన వాహనాలు తొలగించడానికి క్రెయిన్స్, అందుబాటులో ఉంచాలని చెప్పారు. గుర్తింపు కార్డులు జారీ చేసిన అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులను అనుమతించరని చెప్పారు. అత్యంత పకడ్బందీ పటిష్ట బందోబస్తు ఉంటుందని, అధికారులు కేటాయించిన ప్రాంతాల్లో ఉండాలని చెప్పారు. అధికారులకు విధులు సెక్టార్లుగా విభజించనున్నట్లు చెప్పారు. కేటాయించిన సెక్టార్లుల నుండి వేరొక సెక్టారులోకి అనుమతించరమని ఆయన పేర్కొన్నారు.

Related posts

ఇంతవరకు 12,521 లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశాం

Satyam NEWS

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని దుర్వినియోగం చేస్తున్నారు

Satyam NEWS

కపట నాటకం: జగన్ చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి?

Bhavani

Leave a Comment