Slider వరంగల్

నిరుపేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

#Vardannapet MLA

నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా, బడుగుబలహీనవర్గాల అభివృద్దే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు.

గ్రేటర్ వరంగల్ 1డివిజన్ పలివెల్పుల నుండి గుడిసెవాసులు ఎమ్మెల్యే అరూరి రమేష్ ని హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో కలిశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. అర్హులైన వారందరికీ జీవో 58ద్వారా ఉచితంగా ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే దాదాపుగా అన్ని కాలనీలలో సిసి రోడ్లు, డ్రైన్లు, ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు, ఇంటి నెంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. బిఆర్eఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మన కళ్ళముందు కనిపిస్తోందని గుర్తు చేశారు. గుడిసె వాసుల సొంత ఇంటి కళను సాకారం చేసే దిశగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నరెడ్ల శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్ గణిపాక విజయ్, ఎమ్మార్వో రాజ్ కుమార్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కారు ఆటో డీ.. ముగ్గురికి గాయాలు

Bhavani

ప్రజల్ని దగా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

Satyam NEWS

Leave a Comment