38.2 C
Hyderabad
April 29, 2024 19: 04 PM
Slider నల్గొండ

ప్రజల్ని దగా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

#padmavati

హుజూర్ నగర్ ఆర్.డి.ఓ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

టి పి సి సి పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దగా చేయడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఇందిరా సెంటర్లో కెసిఆర్  దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.అనంతరం ఆర్ డి ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి పలు డిమాండ్లతో కూడిన వినతి పాత్రాన్ని ఆర్ డి ఓ కి అందజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేతలు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బి.ఆర్.ఎస్.పార్టీ ప్రప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ,తమ స్వంత పార్టీ ప్రచారం చేసుకుంటుందని,ఇందుకు నిరసనగా దశాబ్ది దగా పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ తమయొక్క నిరసనను చేపట్టాలని పార్టీ నిర్ణయించడం జరిగిందని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు

1.కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేయలేదు.

2.ఫీజ్ రీయంబర్స్ మెంట్ కాలేదు.

3.ఇంటికో ఉద్యోగం రాలేదు.

4.నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.

5.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు.

6.దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఊసే లేదు.

7.పోడు భూములకు పట్టాలు ఇవ్వనే లేదు.

8.రైతు ఋణ మాఫీ కాలేదు.

9.12 శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు కాలేదు.

10.12 శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు కాలేదని,ఇన్ని ప్రభుత్వ వైఫల్యాలు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడాన్ని తామ నిరసన తెలియజేస్తున్నామని,ఈ వినతి పత్రాన్ని తమ ద్వారా ప్రభుత్వానికి అందజేయాలని కోరుతున్నామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టి పి సి సి ఉపాధ్యక్షురాలు ఉత్తమ్ పద్మావతి,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు యరగని నాగన్న గౌడ్, దొంగరి వెంకటేశ్వర్లు,అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,కస్తాల శ్రావణ్ కుమార్,తేజవత్ రాజ నాయక్,జక్కుల మల్లయ్య,భూక్యా మంజు నాయక్,త్రిపురం అంజన్ రెడ్డి, గల్లా వెంకటేశ్వర్లు,కుక్కడపు మహేష్, కందుల వినయ్,కంకణాల పుల్లయ్య, కోళ్ళపూడి యోహన్,ముషం సత్యనారాయణ,బెల్లంకొండ గురవయ్య, షేక్ చాంద్ మియా,గంగసాని ఎల్లారెడ్డి, రామిశెట్టి అప్పారావు,పులి బాలకృష్ణ, రెడపంగు రాము,కస్తాల సైదులు,తెప్పని యలమంద,కోల మట్టయ్య,మోదాల సైదులు,బంటు సైదులు, దొంతగాని జగన్,బెల్లంకొండ వెంకట్ నారాయణ,జింజిరాల సైదులు, ఎస్.కె.ఉద్దండు,అంజనపల్లి సుదర్శన్, కందుకూరి రాము,షేక్ ఫరీద్,వీరేష్, గడ్డం అంజయ్య,పాలకూరి లాలు, మోదాల వెంకన్న,నాగుల్ మీరా,అధిక సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కామారెడ్డి కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

Satyam NEWS

హునార్ హాట్: హస్త కళా ప్రదర్శన ప్రారంభించిన కేంద్ర మంత్రి

Satyam NEWS

వనపర్తి ప్రజలపై మునిసిపాలిటీ యూజర్ చార్జీల పిడుగు

Satyam NEWS

Leave a Comment