40.2 C
Hyderabad
April 29, 2024 15: 06 PM
Slider జాతీయం

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

icici lombard

భారతదేశ అగ్రగామి జీవితేతర బీమా కంపెనీల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్ కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరి కట్టేందుకు ఒక విశిష్ట సీఎస్ఆర్ కార్యక్రమానికి నాంది పలికింది.

ఆరోగ్య సంరక్షణ రంగంలో తనకు గల అనుభవం, సంబంధాలను దృష్టిలో ఉంచుకొని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్ తో, మెట్రోపొలిస్ హెల్త్ కేర్ తో  భాగస్వామి గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ -19 అనుమానిత కేసులను పరీక్షించేందుకు అవసరమైన టెస్టింగ్ కిట్స్ తో యావత్ స్క్రీనింగ్ ప్రొసీ జర్ కు నిధులను సమకూర్చనుంది. 

ఈ కార్యక్రమం కోసం సంస్థ రూ.5 కోట్లు వెచ్చించనుంది. ఇది సమాజం లోని అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చనుంది. టెస్టింగ్ కిట్, ఇంటి నుంచి శాంపిల్ సేకరణ, డయాగ్నోసిస్, టెస్ట్ రిజల్ట్ జనరేట్ చేయడం లాంటివి కలిపి కోవిడ్ -19 టెస్ట్ వ్యయం ప్రస్తుతం రూ.4,500 గా ఉంది.

ఇప్పటికే ఈ కార్యక్రమం కింద పేద వర్గాలకు చెందిన 11,000 మంది ప్రయోజనం పొందారు. వీరంతా కూడా వైరస్ లక్షణాలు కలిగి ప్రాధాన్యపూర్వకంగా టెస్ట్ లు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నవారే. అంతేగాకుండా టెస్టింగ్ కిట్స్ ధరలు తగ్గితే సమాజంలో మరెంతో మందికి ఈ కార్యక్రమం మేలు చేయనుంది.

అంత్యోదయ రేషన్ కార్డు, బీపీఎల్ రేషన్ కార్డ్ కలిగిన వారు ఈ కార్యక్రమం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ భార్గవ్ దాస్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ సవాళ్ళ సమయంలో సమాజంలోని పేదలు కోవిడ్-19కు లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.

Related posts

అభాగ్యుడి ఆకలిని తీర్చిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి

Satyam NEWS

లాఠీఛార్జిలో గాయపడిన వారిని పరామర్శించిన జూపల్లి

Satyam NEWS

Leave a Comment