రాష్ట గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గా ఉన్నసమయంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు ఇందిర కాలని ఎస్సీ (మాల)కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేయించారు. గత యేడాది పట్టణంలోని అన్ని కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేయించారు. అదే సమయంలో కొల్లాపూర్ పట్టణంలోని ఇందిరా కాలనీ లో ఎస్సీ (మాల) కమ్యూనిటీ హాల్ కు ప్రత్యేక నిధులతో ఆరు లక్షలు మంజూరు చేశారు. ఇప్పుడు నిధులు మంజూరు కావడంతో సోమవారం ఏఈ శివకృష్ణ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇదివరకే టెండరు పూర్తయిందని ఆయన తెలిపారు. గురువారం నుండి జెసిబి తో ముళ్ళ పొదలు తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆరులక్షలు మంజూరు అయినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పి.స్వాములు, డి.బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
previous post