ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మికంగా బదిలీ చేశారు. బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ డైరెక్టర్ జనరల్ గా ఆయనను నియమించారు. కొత్త సీఎస్ గా ప్రస్తుత భూపరిపాలన కమిషనర్ నీరభ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ సమావేశం అజెండా రూపకల్పనలో నిబంధనలు పాటించలేదని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీన్ ప్రకాశ్ కు ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ తరుణంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనాయంత్రాంగంపై విశేష ప్రభావం చూపే ఈ నిర్ణయం ముఖ్యమంత్రి ఎందుకు తీసుకున్నారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రవీణ్ ప్రకాశ్ తీసుకున్న నిర్ణయాలు కరెక్టు అనే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉండటంతో సీనియర్ ఐఏఎస్ అధికారులలో ఆలోచన కలిగిస్తున్నది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.
previous post