28.2 C
Hyderabad
April 30, 2025 07: 03 AM
Slider సినిమా

అక్టోబర్ 1 విడుదల: ఆద్యంతం అలరించే ‘అసలేం జరిగిందంటే…?’

#asalemjarigindate

“అసలు ఏం జరిగిందంటే చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అలరించనుంది.

“పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి” తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. మొన్న వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతికి చిన్నప్పటి కారెక్టర్ తో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా.. శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా, ‘రమణా లోడెత్తాలిరా’ ఫేమ్ కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి, దొరబాబు ముఖ్య పాత్రలలో రూపొందిన ఈ సినిమా కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుంది అని.. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని చిత్ర రచయిత & దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేసారు.

జి.ఎస్.ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ ద్వారా అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్నారు. ఎమ్.జి.ఎమ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, సాహిత్యం-సంగీతం: చరణ్ అర్జున్, కూర్పు: జె.ప్రతాప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి, నిర్మాణం: జి.ఎస్.ఫిల్మ్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ బండారి!!

Related posts

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి

Satyam NEWS

ప్రపంచ సినిమా చూపు తెలుగు సినిమా వైపు

Satyam NEWS

తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని చీల్చేయాలని చూశాడు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!