40.2 C
Hyderabad
May 5, 2024 15: 58 PM
Slider నల్గొండ

చర్చలతో వీధి చిరు వ్యాపారుల సమస్య పరిష్కారం

#Roshapati

గత కొన్ని రోజులుగా వీధి చిరు వ్యాపారులను ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారుల వత్తిడి పెరగడంతో గురువారం  వీధి చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గెల్లీ అర్చన రవి, అధికారులు, యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

ఎక్కడి దుకాణాలు అక్కడే పెట్టాలనే నిర్ణయానికి రావడంతో సమస్యలు పరిష్కారం అయిందని జిల్లా CITU ఉపాధ్యక్షు శీతల రోషపతి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో వీధి చిరు వ్యాపారులైన కూరగాయలు, నిమ్మకాయలు, పండ్లబండి మీద పెట్టుకొని  జీవిస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు తొలగించాలని ఇటీవల వత్తిడి తెచ్చారు.

వెంటనే ఖాళీ చేయాలని ఒత్తిడి పెట్టడంతో గత 30 సంవత్సరాల నుంచి జీవిస్తున్న తమకు ఫైనాన్స్, చిట్టీలు కట్టేందుకు బ్రతుకు భారమైందని, జీవనోపాధి కోసం ఒక ప్రక్క ప్రభుత్వం లోన్ సౌకర్యం కల్పిస్తుంటే మరోప్రక్క మున్సిపల్ అధికారులు తొలగించాలనటం సరైంది కాదని అన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్, అధికారులతో, యూనియన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలించటంతో వీధి చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, కౌన్సిలర్లు,పోలీసు అధికారులు, సిఐటియు యూనియన్ ప్రతినిధులు చింతకాయల శేఖర్, అశోక్, వాకిటి సుందరం, రాజేష్, కస్తూరి, రామ్, అంజి,రాజేష్, కృష్ణ, అనూష,

అంజలి, వీరమ్మ, అజ్జు, వెంకన్న, కనకమ్మ పిచ్చమ్మ విజయ విజయసాయి రెడ్డి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

“నేనెవరు” అంటున్న కోలా బాలకృష్ణ!!

Satyam NEWS

మూడు ప్రాంతాల్లో 85ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Bhavani

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీకి పరాజయం

Satyam NEWS

Leave a Comment