29.7 C
Hyderabad
May 4, 2024 06: 49 AM
Slider రంగారెడ్డి

అవినీతికి పాల్పడిన కంప్యూటర్ ఆపరేటర్ పై ఏసీబీ వల

#ACBTrap

కరెంటు బిల్లు తక్కువ చేయడానికి లంచం అడిగిన కంప్యూటర్ ఆపరేటర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూర్ DE కరెంట్  కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. తాండూర్ కు చెందిన మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తికి మల్కాపూర్ గ్రామ పరిధిలో నాపరాయి గనులు ఉన్నాయి.

గనులలో రాయి తీసేందుకు 74 HP కరెంట్ మోటర్ తో పని నడుస్తున్నది. ఆ మోటార్ కు అధిక బిల్లు వస్తుందని గత ఏడాది నవంబర్ లో DE కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

అయితే తాను బిల్లు తక్కువ చేస్తానని అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ సాబెల్ తెలిపారు. బిల్లు తక్కువ చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేశాడు.

దాంతో ఖలీద్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఏసీబీ డి.ఎస్.పి సయ్యద్ ప్యాయజ్, సిబ్బంది తో కలిసి DE కార్యాలయం పై దాడి చేశారు. సాబెల్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.

DE రామదాసు కు ఈ అవినీతిలో పాత్ర ఉందా లేదా అనేది విచారణ జరుగుతున్నది.

Related posts

దేవుళ్ళనే దోచే దొంగ దొరికాడు

Bhavani

ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నదీ ప్రవాహం

Satyam NEWS

అకాల వర్షంతో చేతికి అందివచ్చిన పంట నీటిపాలు

Satyam NEWS

Leave a Comment