అకాల వర్షాలు, గాలులకు దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించిన రాజంపేట మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి నేడు పరిశీలించారు. రాజంపేట నియోజకవర్గం లో అకాల వర్గాలకు,గాలులకు దెబ్బతిన్న పంటలను రెవెన్యూ అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో కలిసి రాజంపేట మాజీ శాసనసభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి, అకేపాటి శ్రీనువాసులు రెడ్డి (మురళి) పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అకాల వర్షం గాలులతో అనేక వందల ఎకరాల్లో పంట నష్టం వచ్చిందని తెలిపారు. కరోనా వైరస్ వల్ల ధరలు అంతంత మాత్రమే ఉంటే ఈ సమయంలో ఉన్న పంట గాలులకు పడిపోవడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు దెబ్బ తిన్న పంటలను సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు, జిల్లా కలెక్టర్ హరి కిరణ్ కి చర వాణి ద్వారా తెలియజేసారు.
ఇది రైతుల ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు పక్ష పాతి అని నష్ట పరిహారం త్వరగా అందిస్తారని రైతులు ధైర్యంగా ఉండాలని ఆయన అన్నారు. అనంతరం అకేపాడు గ్రామ సచివాలయంలో రెవెన్యూ హార్టికల్చర్ అగ్రికల్చర్ సచివాలయ సిబ్బందితో సమావేశం తక్షణమే దగ్గరికి వెళ్లి నష్టం అంచనా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ దండు గోపి, ఆదర్శ రైతులు మురళి మోహన్ రెడ్డి,పోలి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి గీతాల నరసింహా రెడ్డి, ప్రసార ప్రచార కమిటీ అధ్యక్షుడు బొల్లినేని రామమోహన్ నాయుడు,సుబ్బరాజు, అధికారులు,నష్టపోయిన రైతులు తదితరులు పాల్గొన్నారు.