38.2 C
Hyderabad
May 3, 2024 21: 17 PM
Slider ముఖ్యంశాలు

బీఆర్ఎస్ పార్టీ లో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారు

#nittuvenugopalarao

బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోవర్టులున్నారని, వారి వల్లనే చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ చైర్మన్ తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు అన్నారు. అవిశ్వాసం అనంతరం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిట్టు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాల 3 నెలల పాటు మున్సిపల్ చైర్మన్ గా ప్రజలకు సేవ చేయడంతో పాటు కామారెడ్డి అభివృద్ధికి అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు.

బీఆర్ఎస్ లోని కొంతమంది నాయకులు, కౌన్సిలర్ల వల్లనే అవిశ్వాసం నెగ్గిందని, పార్టీలో ఉంటూ కోవర్టులుగా పని చేసారన్నారు. ఈ నెల 11 న అవిశ్వాస నోటీసు ఇచ్చిన తర్వాత 13 వ తేదీన తాను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ ను కలిశానని, బీఆర్ఎస్ లో ఉన్న 16 మందిని కాపాడుకుంటే చైర్మన్ పీఠం ఎక్కడికి వెళ్లదని చెప్తే మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో మాట్లాడి చెప్తానని చెప్పారన్నారు. అందరితో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయాలని నాలుగు రోజుల పాటు వెంట పడినా పట్టించుకోలేదని తెలిపారు.

అంతా కుట్ర ప్రకారమే చేశారు

నాలుగు రోజుల తర్వాత తనపై ఒత్తిడి పెరుగుతుందని, బీఆర్ఎస్ కౌన్సిలర్లను క్యాంపుకు తీసుకెళ్లాలని ముజీబోద్దీన్ కాంగ్రెస్ లో చేరిన వైస్ చైర్మన్ భర్త గడ్డం చందుతో చెప్పడంతో రాత్రికి రాత్రి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారని, విషయం తెలిసి మరుసటి రోజు తాను వెళ్లి అడిగితే నియోజకవర్గ ఇంచార్జి కౌన్సిలర్లతో మీటింగ్ అవసరం లేదంటున్నారని తనకు సమాధానమిచ్చారని, ఏదైనా ఉంటే  ప్రయత్నం నువ్వు చేసుకో అన్నారని తెలిపారు. అనంతరం 8 మంది కౌన్సిలర్లను తాను కలిసి అడిగితే జిల్లా అధ్యక్షుడు ముజీబ్, నియోజకవర్గ ఇంచార్జి గంప గోవర్ధన్ తో చెప్పిస్తే తాము క్యాంపుకు వెళ్లడం మానుకుంటామని, మమ్మల్ని బెదిరించి భయపెడుతున్నారని చెప్పారని తెలిపారు.

16 వ వార్డు కౌన్సిలర్ భర్త రామ్మోహన్ క్యాంపుకు వెళ్లకపోతే పిలిపించుకుని బెదిరించారని, మైనార్టీ కౌన్సిలర్లతో తాను బీజేపీలో చేరుతున్నానని మోసపూరిత మాటలు చెప్పారన్నారు. ఇవన్నీ విషయాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు వెళ్లి చెప్తే ఆయన గంప, ముజీబ్ లకు ఫోన్ చేశారని, 28 వ తేదీన 16 మంది కౌన్సిలర్లను తీసుకుని తన వద్దకు రావాలని కేటీఆర్ చెప్పారని, అయినా నాలుగు రోజుల పాటు కాలయాపన చేయడంతో పాటు మళ్ళీ కేటీఆర్ ఫోన్ చేసినా స్పందించలేరని ఆరోపించారు.

పూర్తి ఆధారాలు ఉన్నాయి

బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ కోవర్టులుగా పూర్తి సహకారం అందించారని, తనవద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. శనివారం 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ కు చెందిన 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి హాజరై మద్దతు తెలిపారన్నారు. పార్టీలో కొనసాగుతూ డబ్బులకు అమ్ముడు పోయిన వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి కూడా పార్టీలో ఉన్న కోవర్టులే కారణమని అనుమానం కలుగుతోందన్నారు. జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంఛార్జీలను మార్చాలన్నారు.

పార్టీలో కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి విజ్ఞప్తి చేసారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, బీఆర్ఎస్ లోనే ఉంటానని, పార్టీకి పూర్వ వైభవం కోసం కృషి చేస్తానన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాలులో జహీరాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సమావేశానికి రావాలని తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాలని సమావేశానికి వస్తున్న హరీష్ రావును కోరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

దట్టమైన అడవి…. దయనీయ స్థితిలో పడి ఉన్న శవం….

Satyam NEWS

భారీ ఉగ్రకుట్ర భగ్నం :ముగ్గురు ఐసిస్​ ముష్కరుల అరెస్ట్​

Satyam NEWS

కేపీహెచ్ బీ లో ఘనంగా బండి సంజయ్ జన్మదినం

Satyam NEWS

Leave a Comment