40.2 C
Hyderabad
May 5, 2024 16: 04 PM
Slider హైదరాబాద్

గ్రేటర్​ ఎన్నికల ఇంఛార్జ్​గా కేటీఆర్​..

ktr

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడా ఏమరపాటు ఉండొద్దని.. పోలింగ్ ముగిసే వరకు అందరూ కష్టపడి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్​ సూచించారు. విపక్షాల అబద్ధాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు.

క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేదిలేదని స్పష్టం చేశారు. మంత్రులు సహా ముఖ్యులను డివిజన్​కు ఓ ఇంఛార్జ్​గా బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో పూర్తిగా సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.

పార్టీ విబేధాలు ఎక్కడా కన్పించొద్దన్నారు. కచ్చితంగా గెలిచేవారికే టిక్కెట్లు ఉంటాయని తేల్చి చెప్పారు. అసంతృప్తి, అసమ్మతి బెడద ఉండరాదన్నారు.

ఎన్నికల్లో పార్టీకోసం శ్రమించే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జ్​గా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ను నియమిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ కార్పొరేషన్​ను నిలబెట్టుకుంటామని తెలిపారు. ఖమ్మంలోనూ గెలిచేందుకు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది..

Related posts

హమ్మయ్య… వర్షం వచ్చింది.. లేకుంటే పరువు పోయేది…

Satyam NEWS

ఆబ్సెంట్: ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల డుమ్మా

Satyam NEWS

ఏప్రిల్ 14 నుంచీ రెండో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment