28.7 C
Hyderabad
May 5, 2024 23: 49 PM
Slider విశాఖపట్నం

హమ్మయ్య… వర్షం వచ్చింది.. లేకుంటే పరువు పోయేది…

#gudivadaamarnath

వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పడిన నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు నేడు విశాఖపట్నంలో జరిగిన గర్జన సక్సెస్ అయిందా? ‘‘అనుకున్నదొకటి… అయ్యింది ఒక్కటి….’’ అంటూ వైసీపీ నేతలే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దాదాపు 5 లక్షల మంది జనసమీకరణ చేస్తామని చెప్పిన వైసీపీ నేతలు పట్టుమని పాతిక వేల మంది కూడా రాకపోవడంతో ఒక్క సారిగా హతాశులయ్యారు.

మరో వైపు జన సమీకరణ కు స్థానిక నాయకులు, వాలంటరీ లు తమ శక్తి వంచ లేకుండా కృషి చేసినా కూడా ఫలితం దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సభ ప్రారంభానికి ముందు జనం అనుకున్న సంఖ్యలో రాలేదు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వైసిపి నాయకులు, వైసిపి కార్యకర్తలు రావడంతో పరువు నిలిచింది. డ్వాక్రా మహిళలు సైతం హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ .. వైసీపీ కార్యకర్తలు.. వాలంటరీ ల చేతుల్లో జెండా లు పెట్టి సభను కొనసాగించారు.. పైగా స్టేజ్ పై ఉద్వేగ పూరిత ప్రసంగాలు లేవు.. సభకు ముందు మంత్రి అమర్నాథ్ చెబుతూ కనీసం లక్ష మంది వస్తారు అని ప్రకటించారు.

అంతకుముందు 5 లక్షల మంది వస్తారని చెప్పిన నేతలే తమ సంఖ్యను తగ్గించుకోవడంతోనే అందరికి పరిస్థితి అర్ధం అయింది. కొద్ది సేపు కూడలి దాకా నడిచి మమ అనిపించి వెళ్లిన వారే ఎక్కువ.. గర్జన న తో తమ బలంతో బాగా గర్జిద్దాం అనుకున్న నాయకులు సైలెంట్ అయిపోయారు.. తిరుగు ప్రయాణం లో విమానాశ్రయానికి మంత్రులు వెళ్తున్న సమయంలో జనసేన నాయకులు జై జనసేన నినాదాలతో హోరు ఎత్తించారు. కొందరు ఆకతాయి లు మంత్రులు కార్ల పై రాళ్లు విసిరారు.. రాళ్లు జనసేన కార్యకర్తలు విసిరారు అని మంత్రులు చెబుతున్నారు.. కానీ ఈ విషయాన్ని పోలీసులు ఎక్కడ ధ్రువీకరించలేదు..అసలే  గర్జన వైసిపి అనుకున్న అంత హిట్ కాలేదు.. కాబట్టి మంత్రులు రాళ్లు రువ్వారు అని హిట్ ఎక్కే మాటలు మాట్లాడారు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

5 రోజులు కష్టం.. 5 లక్షలు మంది వస్తారు అనుకున్నా .. కనీసం లక్ష మంది కూడా రాక పోయే సరికి ఆ  5 ఐదుగురు హతాశులయ్యారు. అయితే భారీ వర్షం కారణంగానే సభకు అనుకున్న స్థాయిలో జనం రాలేకపోయారని వైసీపీ నాయకులు తమ వైఫల్యాన్ని వర్షంపైకి నెట్టివేస్తున్నారు.

Related posts

భాషోపాధ్యాయుల బదిలీ సమస్యలను పరిష్కరించండి

Satyam NEWS

బిచ్కుంద మైనార్టి గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Satyam NEWS

చైత్రోదయం

Satyam NEWS

Leave a Comment