39.2 C
Hyderabad
May 4, 2024 22: 06 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో అవినీతి,అక్రమాలు

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీకి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ ను కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలిసి వినతి పత్రం అందజేశారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీకి 10 శాతం స్థలం కేటాయించకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేవుట్లను వెంటనే తొలగించాలని, కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలకు, ఎస్ఎస్మెంటు నెంబర్లను కేటాయించుకొని ప్రభుత్వ భూములు ఆక్రమించి,అవినీతికి పాల్పడుతున్నారని, ప్రైవేటు యజమానులు కట్టుకున్న ఇండ్లకు మునిసిపాలిటీ ఆదాయానికి గండి పడేలా లంచాలు తీసుకొని దొడ్డి దారిన కొంతమంది ఇంటి నెంబర్లు ఇప్పిస్తున్నారని,విపిఆర్ వెంచర్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన 2500 వందల గజాల స్థలాన్ని వెంటనే స్వాధీన పరుచుకోవాలని, 13వ,వార్డులో ఎస్టీ స్మశాన వాటికకు దారి లేదని దారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళిన విషయాలను గతంలో నల్గొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక మార్లు స్వయంగా జిల్లా కలెక్టర్ కు చర్యలు తీసుకోవాలని తెలియజేశారని, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలియజేయగా అడిషనల్ కలెక్టర్ స్పందించి తన దృష్టికి వచ్చిన విషయాలను వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తేజావత్ రాజా నాయక్,కోతి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

యువతికి అండగా నిలిచిన దిశ పోలీసులు

Bhavani

దళితులను అణచివేస్తున్న దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది

Satyam NEWS

15న టి‌ఆర్‌ఎస్ కీలక సమావేశం

Murali Krishna

Leave a Comment