29.7 C
Hyderabad
April 29, 2024 10: 54 AM
Slider విశాఖపట్నం

యువతికి అండగా నిలిచిన దిశ పోలీసులు

#Disha police

విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దిశ పోలీసులు ఆకతాయిల ఆటకట్టించారు. ఓ యువతి షాప్ కు వెళ్తుండగా కొందరు యువకులు బాడ్ గా కామెంట్స్ చేయడంతో పాటు, వెంటపడి వేధించారు. షాప్ లోకి వెళ్లిన యువతి దిశ SOS ఎమర్జెన్సీ బటన్ నొక్కి పోలీసులకు సమాచారం అందించింది.

కేవలం ఆరు నిముషాల వ్యవధిలో దిశ పోలీసులు బాధిత యువతి ఉన్న లొకేషన్ కు చేరుకున్నారు. యువతి వెంటపడి ఇబ్బంది పెట్టిన ఇద్దరు యువకులను దిశ పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఇద్దరు యువకులు కూడా తాము తప్పు చేశామని, క్షమించమని యువతిని ప్రాధేయపడ్డారు.

బాధిత యువతి సూచన మేరకు ఇద్దరు యువకులకు దిశ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కిరణా షాప్ లోకి వెళ్లి బయటకు వచ్చే లోపే దిశ పోలీసులు వచ్చారని బాధిత యువతి సంతోషం వ్యక్తం చేసింది. ఇద్దరు పోకిరీలు వెంటపడి వేధిస్తున్న తరుణంలో ధైర్యం కోసం దిశ యాప్ కు కాల్ చేశానని యువతి తెలిపింది.

కానీ కేవలం ఆరు నిముషాల వ్యవధిలోనే దిశ పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించడం పోలీస్ శాఖ పనితీరుకు నిదర్శనమని బాధిత యువతి స్పష్టం చేసింది.

Related posts

దాసోజు శ్రవణ్ తో డాక్టర్ కేతూరి భేటీ

Satyam NEWS

తెలంగాణ ప్రభుత్వమా? కల్తీ కల్లును అరిక‌ట్ట‌లేవా?

Satyam NEWS

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు

Satyam NEWS

Leave a Comment