29.7 C
Hyderabad
May 6, 2024 06: 39 AM
Slider ముఖ్యంశాలు

తిరుమలలో అవినీతి రాజ్యమేలతావుంది

#ramana

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వివాదాస్పద ట్వీట్‌పై దుమారం రేగుతోంది.  బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఆలయ విధానాలతోపాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఈ మేరకు సీఎం జగన్‌ని ట్వీట్‌లో ట్యాగ్ చేశారు రమణ దీక్షితులు. అంతకుముందు వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేస్తారని అర్చకులు భావించారన్నారన్నారు రమణ దీక్షితులు. ఈ విషయమై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడం అర్చకులను తీవ్ర నిరాశపరిచింది అన్నారు రమణ దీక్షితులు.అయితే అనుహ్యంగా రమణ దీక్షితులు కొంతసేపటి తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ కనిపించకపోయినా.. అప్పటికే కొందరు స్క్రీన్ షాట్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. ఇదిలా ఉంటే.. తాజాగా రమణదీక్షితులు మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్ ”శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయి. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారు. ప్రస్తుతం తిరుమలలో అవినీతి రాజ్యమేలతావుంది” అంటూ రమణదీక్షితులు ట్వీట్ చేశారు.

Related posts

రవిప్రకాష్‌ సర్వే ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు

Satyam NEWS

రాబిన్ శర్మ టీంతో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” శిక్షణా కార్యక్రమం

Bhavani

పులివెందుల నుంచి వచ్చిన కారులో పుట్టల కొద్దీ బంగారం

Satyam NEWS

Leave a Comment