39.2 C
Hyderabad
April 28, 2024 11: 46 AM
Slider ఖమ్మం

డిసెంబర్‌ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు

#ajay

డిసెంబర్‌ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షా దక్షుడు కేసిఆర్ నాయకత్వంలో ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజని, ప్రపంచ శాంతియుత ఉద్యమ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఉద్యమ వీరుని ప్రస్థానానికి పదమూడేళ్ళ పూర్తయ్యాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అద్భుత సందర్భం డిసెంబర్ 9 ప్రకటన అని తాను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ అకుంఠిత దీక్షతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష యావత్ భారతదేశాన్ని కదిలించింది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Related posts

దేశ శ్రేయస్సు కోసం పాటుపడిన మహానీయుడు రాజీవ్ గాంధీ

Bhavani

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విస్తృత అధికారాలతో సిట్

Satyam NEWS

ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఎక్కడా గొడవలు జరగలేదు

Satyam NEWS

Leave a Comment