Slider విజయనగరం

“దిశ జాగృతి”తో పోక్సో నేరాలు తగ్గుముఖం

#vijayanagarampolice

వార్షిక మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక పాటిల్

2022 సంవత్సరంలో జిల్లా పోలీసుశాఖ సాధించిన ప్రగతి, చేధించిన కేసులు వివరాలను వెల్లడించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.దీపిక వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలను నిరోధించేందుకు మహిళలు, విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో దిశ జాగృతి యాత్రను 10రోజులు నిర్వహించి, పాఠశాల విద్యార్థుల్లో చైతన్యం తీసుకొనివచ్చామన్నారు. విద్యార్ధుల్లో అవగాహన కల్పించిన కారణంగా ఈ సంవత్సరంలో పోక్సో కేసులు నమోదు సంఖ్య గణనీయంగా తగ్గాయన్నారు.

దిశ ఎస్.ఓ.ఎస్. యాప్

మహిళలకు దిశ ఎస్.ఓ.ఎస్. పట్ల అవగాహన కల్పించుటలో భాగంగా జిల్లాలో పలుసార్లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, 4,02,156 మందితో దిశ ఎస్.ఓ.ఎస్. యాప్ను డౌన్ లోడ్, రిజిస్ట్రేషను చేయించామన్నారు. ఈ యాప్ కు 19,654 కాల్స్ రాగా, వాటిలో చాలా వరకు యాప్ పనితీరును పరిశీలించేందుకు 19,192 కాల్స్ వచ్చాయని, 44కాల్స్ పై కేసులు నమోదు చేయగా, మరో 418కాల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు రాజీ అయ్యాయన్నారు.

మహిళలపై జరిగిన అఘాయిత్యాలు

2020లో రేప్ కేసులు 76 నమోదు కాగా, 2021లో ఈ తరహా నేరాలు -34 శాతం తగ్గి, 50 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే కేసులు 2020లో 218 నమోదుకాగా, 2022లో -19శాతం తగ్గి, 176కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. 2021లో పోక్సో కేసులు 71 నమోదు కాగా, 2022లో వాటి సంఖ్య – 38శాతం తగ్గి, 44కేసులు మాత్రమే నమోదయ్యాయని జిల్లా ఎస్పీ తెలిపారు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించి, ప్రతీ శనివారంను రోడ్డు ప్రమాదాలు జరగకుండా “నో ఏక్సిడెంట్ డే” పరిగణించి, భద్రత చర్యలు చేపడుతున్నామన్నారు.

రహదారి భద్రత ఎన్ఫోర్స్మెంట్ కేసులు

రహదారి భద్రత చర్యల్లో భాగంగా 2021లో డ్రంకన్ డ్రైవ్ కేసులు 1,063 కేసులు నమోదుకాగా, 2022లో 5,397 కేసులు నమోదు చేసామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 2021లో 6,969కేసులు నమోదుకాగా, 2022లో 10,160 కేసులు నమోదు చేసామన్నారు. అధిక లోడ్ వెళ్ళే వాహనాలపై 2021లో 227కేసులు నమోదు చేయగా, 2022లో 1,734కేసలు నమోదు చేసామన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారిపై 2021లో 1,959 కేసులు నమోదు చేయగా, 2022లో 4,823 కేసులు నమోదు చేసామన్నారు. 2021లో మైనరు డ్రైవింగుపై 141 కేసులు నమోదు చేయగా, 2022లో 1,223 కేసులు నమోదు చేసామన్నారు. 2021లో ట్రిపుల్ రైడింగు చేసిన వారిపై 7,340 కేసులు నమోదు చేయగా, 2022లో 20,272కేసులు నమోదు చేసామన్నారు. ఎం.వి. నిబంధనలు అతిక్రమించిన వారిపై 2021లో 2,08,795 ఈ-చలానా లు విధించగా, 2022లో 2,22,962 ఈ చలానాలను విధించామన్నారు. 2021లో రహదారి ప్రమాదాల్లో 222 కేసలు నమోదై, 238 మంది మృతి చెందగా, 2022లో పోలీసుశాఖ చేపట్టిన భద్రత చర్యల ఫలితంగా -10శాతం కేసుల సంఖ్య తగ్గి 216 కేసులు నమోదుకాగా, మృతులు సంఖ్య -9 శాతం తగ్గి, 216 మంది మాత్రమే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారన్నారు.

ఆస్తికి సంబంధించిన నేరాలు

ఆస్తికి సంబంధించిన నేరాల్లో 2022లో 1,64,35,352/-ల విలువైన ఆస్తులు చోరికి గురికాగా, వాటిలో 85శాతం రికవరీతో1,39,02,852/- ల విలువైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. హత్యలు, లాభాపేక్ష హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాలు, మిస్సింగ్ కేసులు: 2021లో 24హత్యలు జరగా, 2022లో 23 హత్య కేసులు నమోదయ్యాయన్నారు. హత్యల్లో చాలా వరకు అక్రమ సంబంధాలు కారణంగానే కేసులు నమోదయ్యాయన్నారు. 2021లో లాభాపేక్ష హత్యలు 3 నమోదుకాగా, 2022లో ఎటువంటి కేసు నమోదు కాలేదు.

2021లో దోపిడీ కేసులు 10 నమోదుకాగా, 2022లో 4 దోపిడీ (రోబరీ) కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం కేసులు 2021లో 35 కేసులు నమోదుకాగా, 2022లో 12 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయన్నారు. 2021లో 69మంది పిల్లలు తప్పిపోగా, 2022లో 82మంది తప్పిపోయారని, 100శాతం వారిని తిరిగి కనుగొని, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు అప్పగించామన్నారు.

సైబరు నేరాలు

సైబరు నేరాలు సంఖ్య 2022లో పెరిగాయని, 139 కేసులు నమోదయ్యాయన్నారు. సైబరు నేరాల నియంత్రణకు మహిళ పోలీసులతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, డోర్ టూ డోర్ వెళ్ళి, సైబరు మోసాలు జరిగే తీరు, లోన్ యాప్ల వలన కలిగే అనర్థాలను వివరించామని, నేరం జరిగిన తరువాత ఫిర్యాదు చేయడం పట్ల అవగాహన కల్పించడం వలన కేసులు నమోదు సంఖ్య గత ఏడాది కంటే పెరిగాయన్నారు. నేరాలకు శిక్షలుః 2022లో డిస్పోజ్ అయిన కేసుల్లో 60శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయన్నారు. 6,171 కేసులు 2022లో డిస్పోజ్ కాగా, వాటిలో 3,698 కేసుల్లో నిందితులు శిక్షింపబడ్డారన్నారు. జాతీయ లోక్ అదాలతు పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యత కల్పించడం వలన 4,294 ఎఫ్.ఐ.ఆర్. కేసలు, 18,393 పెటీ కేసులు అనగా 22,687 కేసులు డిస్పోజ్ అయ్యాయన్నారు.

ఎన్ఫోర్స్మెంట్ కేసులు

2022లో పేకాట ఆడిన వారిపై 111 కేసలు, కోడిపందాలు ఆడిన వారిపై 28 కేసులు, మద్యం తరలిస్తున్న వారిపై 780 ఎక్సైజ్ కేసులు, నాటుసారా తయారీ, రవాణదారులపై 461 కేసులు నమోదయ్యాయన్నారు. అంతేకాకుండా, జిల్లాలో విస్తృతంగా దాడులు నిర్వహించి, 1,98,410 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసామన్నారు. ఇసుక అక్రమ రవాణదారులపై 158 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణదారులపై 2021లో 32కేసులు నమోదుకాగా, 2022లో 50 కేసులు నమోదు చేసి, 89మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 3,180.855 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి కేసుల్లో కఠిన చర్యలు చేపట్టి, గంజాయి వినియోగిస్తున్న వారిపై కూడా 24 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.

మహిళా సంరక్షణ పోలీసుల సేవలు

పోలీసుశాఖలో నూతనంగా ఉద్యోగులుగా ప్రవేశించిన మహిళ సంర్షణ పోలీసుల సేవలను సమర్ధవంతంగా వినియోగించుకొంటూ, వారితో ప్రజలకు లోన్ యాప్లు, దిశ ఎస్.ఓ.ఎస్. యాప్, సైబరు నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత చర్యల పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా, గ్రామ స్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై ముందస్తు సమాచార సేకరణ, అసాంఘిక కార్యకలాపాలపై సమాచార సేకరణకు వారి సేవలను వినియోగిస్తున్నామన్నారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో

గ్రామ స్థాయిలో సారా నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సారా ప్రభావిత 77 గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాల్లో పూర్తిగా సారాను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 79 కుటుంబాలను గుర్తించి, వారికి జిల్లా కలెక్టరు గారి సహకారంతో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు 43.31 లక్షల ఆర్ధిక సహాయంను 121 మందికి అందించామన్నారు.

ప్రత్యేక పోర్టల్తో పోయిన మొబైల్స్ అందజేత

పోయిన మొబైల్ ఫోనులను తిరిగి కనుగొనేందుకు ఫిర్యాదు దారులు పోలీసు స్టేషనుల చుట్టూ పదే పదే తిరగకుండా ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను రూపొందించి, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ పోర్టల్ కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 544 మొబైల్స్ ను తిరిగి స్వాధీనం చేసుకొని, బాధితులకు అప్పగించామన్నారు.

Related posts

అంబర్ పేటలో మరో ప్రధాన సమస్య పరిష్కారానికి రంగం సిద్ధమైంది

Satyam NEWS

29న ఖమ్మంలో భారీ సభ

Murali Krishna

అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న మిల్లర్లు

Satyam NEWS

Leave a Comment