33.7 C
Hyderabad
April 29, 2024 01: 12 AM
Slider హైదరాబాద్

అంబర్ పేటలో మరో ప్రధాన సమస్య పరిష్కారానికి రంగం సిద్ధమైంది

#amberpetmla

గ‌త కొన్నేండ్లుగా అంబర్ పేట‌ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఫైర్ ఇంజ‌న్ క‌ళ త్వ‌ర‌లో సాకారం కానుంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని అంబర్ పేట నియోజకవర్గం కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేప‌ట్టి దాదాపు నాలుగేండ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతూ అంబర్ పేట ముఖ‌ చిత్రం మారుతోంది.

ముఖ్యంగా అంబర్ పేట లోని ప‌లు ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ అగ్ని ప్రమాదాల‌ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఘటనలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ న‌ష్టం కూడా జరుగుతుంది. వీటి నివార‌ణ‌కు ప్ర‌స్తుతం మలక్ పేట, తార్నాక ప్రాంతాల నుంచి మాత్రమే ఫైర్ ఇంజ‌న్లు అందుబాటులో ఉన్నాయి, అవి కూడా అక్కడి నుంచి ఇక్క‌డికి వచ్చేవరకు దాదాపు జరగాల్సిన నష్టం జరిగియేది. దీంతో అంబర్ పేట నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో ఫైర్ స్టేష‌న్ ఏర్పాటు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో డిమాండ్ ఉంది. ఈ ప్ర‌ధాన స‌మ‌స్య ప‌రిష్కారానికి ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్ ప్ర‌త్యేక చొర‌వ‌తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయ‌నున్న ఫైర్ స్టేష‌న్ల జాబితాలో అంబ‌ర్‌పేట‌ను చేర్చింది. 

ఇందుకు సంబంధించి సోమవారం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏరియా ఫైర్ అధికారి వెంకటేశ్‌.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కు కొత్త ఫైర్ స్టేషన్ కు సంబంధించి అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కాలేరు వెంకటేశ్‌ మాట్లాడుతూ.. అంబర్ పేట  నియోజకవర్గ కేంద్రమైన సీపీఎల్  సమీపంలో త్వరలో స్థ‌ల‌ సేకరణ చేపట్టి భవన నిర్మాణ పనులు చేపడతామన్నారు.

డబుల్ యూనిట్లతో ఏర్పాటు చేసే ఈ అగ్నిమాపక కేంద్రంలో ఎంతటి మంటలనైనా అర్పగలిగే రెండు ఆధునాత‌న ఫైర్ ఇంజన్లు,  ఒక అసిస్టెంట్ జిల్లా ఫైర్ అధికారి,  ఇద్దరు స్టేషన్ ఫైర్ అధికారులు , నలుగురు లీడింగ్  ఫైర్ మెన్ల‌తో పాటు మొత్తం 34 మంది సిబ్బందితో త్వరలోనే ఫైర్ స్టేషన్ అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్ తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

ఆసరా పింఛన్లు బ్యాంకు సర్వీస్ ద్వారా అందించాలి

Sub Editor

నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి

Satyam NEWS

పి.వి.నరసింహారావు పై కవితలకు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment