29.7 C
Hyderabad
April 29, 2024 09: 35 AM
Slider శ్రీకాకుళం

బాధిత హిందీ పండితులకు జీతాలు చెల్లించాలని కలెక్టర్ కు వినతి

#Hindi scholars

2002 బాధిత హిందీ పండితులకు జీతాలు చెల్లించేందుకు తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ కలెక్టర్ శ్రీకేశ్ బి.లాత్కర్ కు విన్నవించింది. కలెక్టర్ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన అనంతరం ఈ మేరకు విన్నవించారు. డీఎస్సీ 2002 లో భాగంగా జులై 2019లో నియామకం పొంది 42 నెలలు గడిచినా ఈనాటికి జీతాల చెల్లింపు ప్రక్రియ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆర్థిక శాఖను దాటి ముఖ్యమంత్రి కార్యాలయం కు చేరిన దస్త్రానికి జిల్లా నుంచి తగు ప్రాతినిధ్యాన్ని అందించి జీతాలు లేక బాధపడుతున్న 39 మంది భాషా పండితుల ఆకలి తీర్చేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిసిని వసంతరావు, రఘుపాత్రుని శ్రీనివాసరావు టేకి బాబురావు, కుప్పన్నగారి శ్రీనివాసరావు , గొడబ మేరీ ప్రసాద్, చింతపల్లి జనార్దన్ రావు ,గంటి మీనా కుమారి, బలివాడ మంజుల రొంపి వలస రామారావు ,మజ్జి వెంకటరమణ అరసవిల్లి గణపతి రావు, పిడపర్తి వెంకట సాయి ప్రసాద్ ,రుప్ప తులసి దాస్, షేక్ జాఫర్, రాడ గణపతి రావు, ఉరిటి శ్రీనివాసరావు, చింతపల్లి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్లాక్ ఫంగస్ ఔషధాలు జనఔషధి దుకాణాల్లో పెట్టాలి

Satyam NEWS

గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి

Sub Editor

స్పందన లేని ప్రత్యామ్నాయం: నిరుత్సాహంలో కేసీఆర్

Satyam NEWS

Leave a Comment