26.7 C
Hyderabad
May 16, 2024 10: 18 AM
Slider ముఖ్యంశాలు

కరోనా ఎలర్ట్: నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

video confarence

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఈ నెల 31 వరకు రాష్ట్రంలో ప్రకటించిన లాక్ డౌన్ కు సంబంధించి జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను పకడ్బందిగా అమలు చేయాలని, జి.ఒ 45, 46 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరోనా వైరస్ (COVID-19) నియంత్రణ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని, ద్విచక్ర వాహనం పై ఒక వ్యక్తి, ఫోర్ వీలర్స్ పై ఇద్దరికి మించకుండా అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎవరిని కూడా రాత్రి 7.00 గంటల తర్వాత నుండి తదుపరి రోజు ఉదయం 6.00 గంటల లోపు అత్యవసర వైద్య చికిత్స మినహా ఏ కారణం పైన కూడా రోడ్లపైకి అనుమతించరాదని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులైన పాలు, కూరగాయలు మరియు ఔషదములు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూడాలన్నారు మరియు ఎక్కువ ధరలకు అమ్మకుండా ఖచ్చితంగా పర్యవేక్షించాలన్నారు. చెక్ పోస్ట్ లలో నిత్యావసర వస్తువుల రవాణా కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

సచివాలయంలో ఇద్దరు సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారులు రాహుల్ బొజ్జ, అనిల్ కుమార్ లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వీరు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తారని అన్నారు. ఇదే తరహాలో జిల్లాలలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లాలలో కనీసం రెండు జిల్లా Quarantine సెంటర్లను సదుపాయాలతో ఏర్పాటు చేయాలని అన్నారు. కలెక్టర్లు ఎవరి కుటుంబాలలో నైన విదేశీ పర్యటనలు చేసివచ్చిన వారు, ఖచ్చితంగా Home Quarantined లో ఉన్న వారి వివరాలు సేకరించడానికి Inter disciplinary teams ఏర్పాటు చేయాలని అన్నారు.

రోజువారి నివేదికలు కంట్రోల్ రూమ్ కు పంపాలన్నారు. జిల్లాలలో Quarantine activities ను మానిటర్ చేయడానికి App ని రూపొందించామని అన్నారు. గ్రామాలలో రైతులు గుమిగూడకుండా వుండానికి గ్రామ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో వరి సేకరణ కేంద్రాలను పెంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రైతులు ఒకరికి ఒకరు సమీపంగా కాకుండా తగినంత దూరంలో ఉండి పరిశుభ్రత పాటించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు తెలిపారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, జనార్దన్ రెడ్డి,  రిజ్వి, సందీప్ కుమార్ సుల్తానియా , సంజయ్ జాజు,   రోనాల్డ్ రోస్, సర్ఫరాజ్ అహ్మద్, డైరెక్టర్ , ఎక్సైజ్,  రజత్ కుమార్ షైనీ, సి.సిఎల్.ఎ డైరెక్టర్ ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Related posts

ఉప్పల్‌ లో ఘనంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా పండుగ

Satyam NEWS

గుడ్ న్యూస్ : ఉల్లి ధరలు త్వరలో తగ్గబోతున్నాయి

Satyam NEWS

బోనాల వైభోగం

Satyam NEWS

Leave a Comment