కరోనా వైరస్ వ్యాధి పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కట్టుబడి ఉండాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరుతున్నారు. ఆదివారం ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటించి మరుసటి రోజు నుండి ప్రజలు రోడ్లపైకి రావడంతో పోలీస్ లు ఎలర్ట్ అయ్యారు.
మార్చి 31వరకు లాక్ డౌన్ ఉండగా ప్రజలు యధావిధిగా రోడ్లపైకి రావడంతో ఎసై కొంపల్లి మురళి గౌడ్ కట్టడి చేశారు. ఇండ్ల నుండి బయటకు రాకూడదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఉదయం కొల్లాపూర్ పట్టణ ప్రజలను ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి యథేచ్ఛగా టిఫిన్ సెంటర్స్ నడిపించారు.
ప్యాసింజర్ ఆటోలను నడిపించారు. షాప్స్ ఓపెన్ చేశారు. సిఐ బి.వెంకట్ రెడ్డి ఆదేశాలతో ఎసై మురళి గౌడ్ వాటిని బంద్ చేయించారు. ఆటోలను స్టేషన్ కు తరలించారు. అయితే మధ్యాహ్నం నుండి ప్రజలు దారిలోకి వచ్చారు. ఇండ్లలోనే ఉండిపోయారు.
కొందరు బాధ్యత లేని వారు పనిలేకున్న టైపాస్ కు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ సందర్భంగా సిఐ బి.వెంకట్ రెడ్డి సర్కిల్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. మంగళవారం నుండి ప్రజలు పూర్తిగా లాక్ డౌన్ కావాలన్నారు. ఎవ్వరి ఇండ్లలో వారు ఉండాలన్నారు.
ఇంట్లో నుండి ఒక్కరు మాత్రమే మెడికల్, నిత్యా అవసరాల కిరణం షాప్స్, పాల కేంద్రాలలో పని ముగించుకొని ఇంటికి వెళ్లిపోవలన్నారు. బైకుల పై ఇద్దరు, అనుమతి లేని వాహనాలలో బయటికి రాకూడదన్నారు. అలాంటి వాహనాలను మార్చి31వ తేదీ వరకు సీజ్ చేస్తామన్నారు.
ప్రభుత్వ ఆదేశాలను పాటించి కరోనా వైరస్ ను తరిమికొట్టాలన్నారు. ఆదేశాలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని సి ఐ బి.వెంకట్ రెడ్డి హెచ్చరించారు.