27.7 C
Hyderabad
May 4, 2024 09: 34 AM
Slider రంగారెడ్డి

న్యూడ్ ఫొటోల కోసం అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే కీచకుడు

#blackmail

న్యూడ్ ఫోటోలు పంపించకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి స్నేహితులకు బంధువులకు  సోషల్ మీడియా పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఒక కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కామాంధుడి వలలో చిక్కి చాలా మంది అమ్మాయిలు మోసపోయారు. ఈ వేధింపులు భరించలేక 15 రోజుల క్రితం ఒక అమ్మాయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు…అర్ధరాత్రి దిల్ సుఖ నగర్ లో ఆ కీచకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్ గా గుర్తించారు. అతను మల్టీమీడియా  చదువుకుంటున్నాడు. నకిలీ ఇంస్టాగ్రామ్ క్రియేట్ చేసి  అమ్మాయిగా పరిచయం చేసుకున్న మోసగాడు ఈ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను  క్లోజ్ ఫ్రెండ్స్ గా చాటింగ్ చేస్తాడు.. తర్వాత ఫోటోలు  పంపించమని రిక్వెస్ట్ చేస్తాడు. అమ్మాయి అనుకోని ఫోటోలు పంపించిన తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు. న్యూడ్ ఫోటోలు పంపించి తన కోరిక తీర్చాలని లేదంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వేధిస్తున్నాడు. ఎందరో అమ్మాయిలు ఈ కీచకుడి వలలో పడ్డారు. పోలీసు విచారణలో చాలా మంది బాధితులు ఉన్నారని వెల్లడి అయింది. మరి కొంతమంది అమ్మాయిలు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

Related posts

అక్షయ తృతీయ రోజు తగ్గిన బంగారం వెండి ధరలు

Satyam NEWS

ప్రతి నిరుపేదను ఆదుకొని ఆర్ధిక సహాయం అందించాలి

Satyam NEWS

మాదకద్రవ్యాల కేసులో టీడీపీ సానుభూతిపరుడి అరెస్టు

Bhavani

Leave a Comment