ఇంద్రపాలెం వంతెనవద్ద ఉప్పుటేరులో చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. దీప్తిశ్రీని సవతితల్లి శాంతకుమారి హత్య చేసి గోనెసంచిలో మూటకట్టి ఉప్పుటేరులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మాడి సత్యం బృందం దీప్తిశ్రీ మృతదేహాన్ని వెలికితీసింది. చిన్నారిని హత్య చేసిన శాంతకుమారి పోలీసుల అదుపులోనే ఉంది. ఆస్తి కోసమే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో శాంతకుమారికి ఎవరైనా సహకారం అందించారా? అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 48 గంటల తర్వాత ఈ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. అయితే మిస్సింగ్ కేసులో మొదట అందరూ అనుమానించినట్లే సవతి తల్లి శాంతకుమారే దారుణానికి పాల్పడింది. స్కూల్ నుంచి తీసుకెళ్ళి హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడేసినట్టు పోలీసులు విచారణలో నిర్ధారించారు. కాకినాడ మేడలైను చుట్టు ఉన్న ఉప్పుటేరులో ధర్మాడి సత్యం బృందం సహాయంతో పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.
previous post