హైదరాబాద్ మరో డ్రగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4.2 కిలోల నిషేధిత ఓపియం డ్రగ్ ను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లి మల్లా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద రాజస్థాన్ కు చెందిన ఈ డ్రగ్స్ ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం రాగానే పోలీసులు నిఘావేశారు. దాంతో గంగారాం అనే వ్యక్తిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి ద్వి చక్ర వాహనం, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న రాజస్తాన్ లోని కొన్ని ప్రాంతాలకు చెందిన కొందరు నగరంలో ఇలాంటి దందా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. గంగారాం పట్టుబడగా బిక్ర మ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. గంగారాం ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో అతడు అతనితోబాటు బిక్రమ్ ఇద్దరూ పని చేస్తున్నారు. గంగారాం ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
previous post