29.7 C
Hyderabad
May 4, 2024 03: 46 AM
Slider కడప

ఆస్తి కోసం తగాదాలో చివరికి ప్రాణం పోయింది

#Kadapa Murder

ఆస్తి కోసం జరిగిన తగాదాలు ఒక వ్యక్తి ప్రాణం పోయే పరిస్థితులకు దారితీశాయి. కడప జిల్లా రైల్వే కోడూరు లక్ష్మి నగర్ కి చెందిన బత్తల చంద్ర శేఖర్ అనే వ్యక్తి ఓబులావారి పల్లి మండలం చిన్న ఓరంపాడు లోని  వ్యవసాయ పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

పొలంలోని ఒక చెట్టు కు  ఉరి వేసుకున్నట్లు వుంది. అయితే అతనే ఉరి వేసుకున్నాడా లేక ఎవరన్నా చంపి చెట్టుకు వేలాడదీశారా అనేది పోలీసు విచారణ లో  తేలాల్సి వుంది. ఈ నెల 2న చంద్ర శేఖర్ మద్యం తాగిన మత్తులో ఉండగా అతని బావ చిట్టి అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించాడని భార్య స్వర్ణ తెలిపింది. అయితే ఆ దాడి లో చంద్ర శేఖర్ చనిపోలేదు. తీవ్రగాయాలతో బయటపడ్డాడు.

చంద్ర శేఖర్ కు అతని తల్లి కి మధ్య ఆస్తి తగాదాలే ఈ గొడవలకి ముఖ్య కారణం. చంద్ర శేఖర్ తల్లి చెంగమ్మ కడుపున పుట్టిన తమకి  కాకుండా ఆస్తి మొత్తం చెంగమ్మ అన్నయ్య ఆయన యమాల అంకయ్య కు ఇవ్వడంతో, చంద్ర శేఖర్  తమ పరిస్థితి ఏంటని  వెళ్లి తరచూ అడిగేవాడు.

ఇది ఇలా ఉండగా దాదాపు 8 సంవత్సరాల క్రితం చెంగమ్మ 3 లక్షలు పెట్టి ఒక స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు 10 రేట్లు  పెరిగి దాని విలువ దాదాపు 35 లక్షలు అయ్యింది. ఇప్పుడు ఆ స్థలాన్ని చెంగమ్మ అన్నయ సొతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, కొడుకులకి  కావాలంటే 2 లక్షలు డబ్బులు ఇస్తాను తీసుకోని  వెళ్లిపోవాలని అనడం తో గొడవ మొదలయ్యాయి.

ఆ గొడవలు చంద్ర శేఖర్ పై హత్యాయత్నం చేసేంత వరకు పెరిగాయి. అయితే తాజాగా చంద్ర శేఖర్ ఎలా చనిపోయాడు అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్ర శేఖర్ కి  స్వర్ణ అనే మహిళా తో  పెళ్లి అయ్యి 9 సంవత్సరాలు అయ్యింది. వారికి ఇద్దరు మగ  పిల్లలువున్నారు. గతం లో దాడి జరిగినప్పుడు పోలీసు వెంటనే స్పందించి ఉంటే ఈ రోజు ఇలా చంద్రశేఖర్ మృతి చెందే వాడు కాదని కేవలం పోలీసులు నిర్లక్ష్యం వల్లనే చంద్ర శేఖర్ మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపించారు.

Related posts

మీడియా టాప్ ట్రెండింగ్ లో నలుగురు హీరోలు

Satyam NEWS

అక్టోబర్ 2న గాంధీ ఆసుపత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ

Satyam NEWS

హాలివుడ్ కు చేరిన టీ20 ప్రపంచకప్ వేడి

Satyam NEWS

Leave a Comment