40.2 C
Hyderabad
May 2, 2024 17: 20 PM
Slider ప్రత్యేకం

మీడియా టాప్ ట్రెండింగ్ లో నలుగురు హీరోలు

#Trending Heros

తెలుగు రాష్ట్రాలలో టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా నెట్ వర్క్ లలో టాప్ ట్రెండింగ్ స్థానం దక్కించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు. గత నెల రోజులుగా రఘురామకృష్ణంరాజు ఇస్తున్న స్టేట్ మెంట్లు, ఇంటర్వ్యూలు, ఆయన విజువల్స్, వీటన్నింటిపై మీడియా, సోషల్ మీడియా ఇస్తున్న వ్యాఖ్యానాలు కోట్లాది మంది చూస్తున్నారు.

మే నెలలో రఘురామకృష్ణంరాజు తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అక్రమ వేలంపై మాట్లాడిన నాటి నుంచి నేటి వరకూ ఆయన ఏం చెప్పినా మీడియాలో టాప్ ట్రెండింగ్ ఐటమ్ గా మారిపోతున్నది. మరీ ముఖ్యంగా అయితే గత నెల మొత్తం టాప్ రేటింగ్ లో ఆయనే నిలిచారు.

రఘు రామకృష్ణం రాజు మాట్లాడితే వైరలే

ఆయన గురించి ఏం చెప్పినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 వ్యూయర్ షిప్ టాప్ కు చేరుతున్నది. చివరకు రాజకీయ విశ్లేషణలు చేసే యూట్యూబ్ స్పెషలిస్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా రఘురామకృష్ణంరాజు గురించి మాట్లాడిన ఎపిసోడ్ లే టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

అందుకోసం ఆయన కూడా రఘురామకృష్ణంరాజు గురించే ఎక్కువ ఎపిసోడ్ లు తయారు చేసుకోవాల్సి వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మరో టాప్ ట్రెండింగ్ హీరో ఉండవెల్లి అరుణ్ కుమార్. ఆయన ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టిన తర్వాత దానిపై వచ్చే వీడియోలు టాప్ ట్రెండింగ్ జాబితాలో చేరిపోతున్నాయి.

ట్రెండింగ్ హీరో ఉండవెల్లి

అరుణ్ కుమార్ కొత్త ప్రెస్ కాన్ఫరెన్సులతో బాటు ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా పాత వీడియోలు కూడా ఎగబడి చూస్తున్నారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆంధ్రా రాజకీయాల్లో సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లలో టాప్ పొజిషన్ లో ఉన్నారు.

తెలంగాణలో కేటీఆర్, హరీష్ ట్రెండింగ్ హీరోలు

ఇక తెలంగాణ విషయానికి వస్తే రాజకీయంగా ఎలాంటి సంచలనం లేకపోయినా రాష్ట్ర ఐటి, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ టాప్ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఆయన ట్వీట్లను ఫాలో అయ్యేవారు అత్యధికంగా ఉండటంతో బాటు ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి.

ఆ తర్వాతి స్థానంలో ఆర్ధిక మంత్రి టి. హరీష్ రావు ఉన్నారు. ఆ మధ్య కాలంలో హరీష్ రావు సిబ్బందికి కరోనా సోకిందనే వార్త దావానలంలా వ్యాపించింది. ఆ తర్వాత ఆయన ఇంటి నుంచే చేసిన వీడియో కాన్ఫరెన్సులు, ఆ తర్వాత గత రెండు రోజులుగా ఆయన పాల్గొంటున్న వీడియో క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ లో హీరో జంధ్యాల రవిశంకర్

ఈ నలుగురితో బాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ న్యాయవివాదం వచ్చినా ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఏం చెబుతారా అని చూస్తున్నారు. ఆయన వాదించే ఏ కేసుకు సంబంధించి అయినా సరే ఆయన ముందస్తుగా పెట్టే ట్విట్లు వైరల్ అవుతున్నాయి.

Related posts

బాలల హక్కుల చట్టం అమలుకు పటిష్ట చర్యలు

Satyam NEWS

అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్లు పంపిణీ చేయాలి

Satyam NEWS

కరీంనగర్ లో టిటిడి బాలాజీ ఆలయ శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment