31.2 C
Hyderabad
May 3, 2024 02: 42 AM
Slider నల్గొండ

Alter crops: రైతు వేదికలతో పెనుమార్పులకు శ్రీకారం

#Minister Jagadeeshreddy

స్వయాన రైతైన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేసేందుకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతు బంధు పెట్టుబడి సాయం అందిస్తూ, గిట్టుబాటు ధర అందించే విధంగా కూడా కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలంలో  రైతు వేదికల నిర్మాణం కి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ అనిత రాం చంద్రన్ లతో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు, రైతు వేదికలకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికల ద్వారా  రైతులు అన్ని విషయాలపై చర్చలు జరుపుకుని, మార్కెటింగ్ కు అనుగుణo గా  పంటలు వేస్తూ లాభాలు గడించాలని మంత్రి పిలునిచ్చారు. రైతు బంధు సమితిల ఏర్పాటుతో తెలంగాణ రైతులు సంఘటితం అయ్యారని మంత్రి తెలిపారు.

రైతులంతా ఏకతాటిపై వచ్చి నియంత్రిత పంటలు సాగు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అనంతరం సిరిపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని  ఆవిష్కరించి, రామన్నపేట మండల కేంద్రంలో వెటర్నరీ హాస్పిటల్ కు  భూమి పూజ చేసారు.

Related posts

ఎన్డీయే సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాణం

Bhavani

కేసీఆర్ ను ఓడగొడితేనే ప్రజల సమస్యలకు పరిష్కారం

Satyam NEWS

రూ.3,200 కోట్ల తో టీటీడీ వార్షిక బడ్జెట్

Satyam NEWS

Leave a Comment