26.7 C
Hyderabad
May 16, 2024 10: 59 AM
Slider ప్రత్యేకం

ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యుల వ్యవస్థకు న్యాయం చేయండి

#rmp

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం  ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు షేక్.మన్సూర్ అలీ మాట్లాడుతూ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009లో జీవో నెంబర్ 429 ద్వారా ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి ప్రభుత్వ శిక్షణకు జీవో నెం.1273 జారీ చేసి,అధిక బడ్జెట్ విడుదల చేసి,రాష్ట్రంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రత్యేక సిలబస్ ఏర్పాటు చేసి,ప్రభుత్వ వైద్యులతో, కమ్యూనిటీ పారా మెడిక్ శిక్షణా తరగతులు ప్రారంభించారని అన్నారు.

1,000 గంటల శిక్షణ అనంతరం ఆర్.ఎం.పి. లు పరీక్షలకు సిద్ధం అవుతుండగా దురదృష్టవశాత్తు వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం ఆ    తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు బడ్జెట్ విడుదల చేయకపోవడం,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతం కావడంతో కమ్యూనిటీ పారా మెడిక్ శిక్షణా తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయని అన్నారు.2014 సాధారణ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్.ఎం.పి,పి.ఎం.పి, గ్రామీణ వైద్యులను గుర్తించి శిక్షణ పూర్తి చేస్తామని,సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపి 2015లో జివో 428 విడుదల చేశారని, కానీ అట్టి జీవో గ్రామీణ వైద్యుల ప్రాథమిక వైద్య సేవలకు భంగం కలిగించే విధంగా ఉండటంతో దానిని సవరించి జీవో 429 ద్వారానే శిక్షణ కొనసాగించి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మొదటి,రెండవ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులను పలుమార్లు కలిసి కోరామని, అయినప్పటికీ ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ పరంగా న్యాయం జరగలేదని అన్నారు.

ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ప్రజలను చైతన్యవంతులను చేసి,కరోనా మహమ్మారి సమయంలో అనేక మంది పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజలకు,నిరక్షరాస్యులకు ప్రాథమిక వైద్య సేవలు,సలహాలు అందిస్తూ అనేకమంది ఆర్.ఎం.పి లు రాష్ట్రంలో కరోనా కాటుకు గురై మరణించారని, అలాగే కేంద్ర ,రాష్ట్ర,ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ ఆరోగ్య సంక్షేమ పథకాలు పల్స్ పోలియో,టీబి,ఎయిడ్స్, కుష్టు వ్యాధి,జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం,బోదకాలు నివారణ వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని, టీకాల ప్రాముఖ్యతను,వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరిస్తున్నారని,జాగ్రత్తలు తెలియజేస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు,తండాలు,మురికివాడల్లోని పేద ప్రజలకు రాత్రనక,పగలనకా ప్రాథమిక వైద్య సేవలు,సలహాలు అందిస్తు సేవలు చేస్తున్న ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యుల బాధలను అర్థం చేసుకొని ఆర్ఎంపి వ్యవస్థకు న్యాయం జరిగే విధంగా అధికారిక చర్యలు తీసుకుని జీవో విడుదల చేయాలని,అధిక బడ్జెట్ కేటాయించాలని,కమ్యూనిటీ పారా మెడికల్ శిక్షణ తరగతులు ప్రారంభించి పరీక్షలు నిర్వహించి,సర్టిఫికెట్లు అందించాలని,సమాజంలో వృత్తి గౌరవం కలిగేటట్లు,సామాజిక భద్రత ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.ఆరోగ్య తెలంగాణలో ఆర్.ఎం.పి, పి.ఎం.పి,గ్రామీణ వైద్యులను భాగస్వామ్యం చేయాలని ముక్తకంఠంతో కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ గ్రామీణ వైద్యులు  భాస రామారావు,పి.వి.బి.చారి, షేక్ జాఫర్,కె.పూలరాజు,వెంకటేశ్వర్లు,  తోట ప్రకాశ్,పి.వీరబాబు, జి.గామాన్యయేల్, షేక్ రసూల్,పి.కిశోర్, జి.వెంకటేశ్వర్లు,వి.శ్రీనివాస్,బి.కృష్ణ , టి.రమేష్ ,షేక్ అహ్మద్,బాలస్వామి అధిక సంఖ్యలో ఆర్ఎంపి,పిఎంపి, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ హుజూర్ నగర్ 

Related posts

లాక్ డౌన్ నేపధ్యంలో కోమటిరెడ్డి క్రికెట్ మ్యాచ్

Satyam NEWS

వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన ఆహారం అందించాలి

Murali Krishna

యుటిఎఫ్ శ్రీకాకుళం 16వ విద్యా వైజ్ఞానిక జిల్లా మహాసభ

Satyam NEWS

Leave a Comment