39.2 C
Hyderabad
May 4, 2024 19: 28 PM
Slider గుంటూరు

కృష్ణా పరివాహక తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

#gitanjalisharma

అల్పపీడనంతో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున తీరప్రాంత లంకగ్రామాల ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ  శనివారం వరద హెచ్చరికలు జారీచేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద   4.46లక్షల క్యూ సెక్ లు పైగా ఉన్న నీటిలో మిగులు జలాలు దిగువకు వదులుతున్న క్రమంలో ,తీరప్రాంత లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరప్రాత గ్రామాలైన తాడేపల్లి,దుగ్గిరాల,కొల్లిపర,తదితర లంకగ్రామాల ప్రజలు, నదిలో ఈతకు వెళ్ళడం,పశువులను తోలుకు వెళ్ళడం చేయరాదన్నారు. ముఖ్యంగా లంకగ్రామాల వారు వ్యవసాయ పనుల నిమిత్తం నదిలొకి వెళ్ళరాదని సూచించారు.తీరప్రాంత ప్రజలు వరద ఉదృతి తగ్గేవరకు అప్రమత్తంగా ఉంటూ,తగు జాగ్రత్తలు  పాటించాలన్నారు.

Related posts

కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ చెక్కులను వెంటనే పంపిణీ చేయాలి

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి బూతు పురాణంపై ఫిర్యాదు

Satyam NEWS

రైతులను పట్టించుకోని జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment