27.7 C
Hyderabad
May 4, 2024 07: 54 AM
Slider శ్రీకాకుళం

యుటిఎఫ్ శ్రీకాకుళం 16వ విద్యా వైజ్ఞానిక జిల్లా మహాసభ

#utfsrikakulam

సమాజంలో పౌరులను ఒక ఉన్నతమైన స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత ఒక ఉపాధ్యాయులదే అని ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ  ఫెడరేషన్ నిర్వహించిన 16విద్యా వైజ్ఞానిక మహాసభ జరిగింది. నేడు జరిగిన మహా సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ  యు.టి ఎఫ్ మహ సభలో మాట్లాడటం చాల గర్వంగా ఉందని అన్నారు. తాను కూడా ఉపాధ్యాయుడిని కావాలనుకున్నాను కానీ  కాలేకపోయానని ఆయన అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే  ఉపాధ్యాయుడిగా కావాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సమాజంలో పౌరులను ఉన్నతమైన వ్యక్తులు గా తీర్చిదిద్దాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు  ఎన్.వెంకటేశ్వర్లు,  పిడిఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పొందూరు అప్పారావు ఎస్ కిషోర్ కుమార్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, రాష్ట్ర పూర్వ కార్యదర్శిగొంటి గిరిదర్ , పడాల భూదేవి, తంగి రమేష్ ,యడ్ల జోగారావు మేసార్ యుటిఎఫ్ జిల్లా జిల్లా నాయకత్వం అన్ని మండలాల నుంచి  కార్యకర్తలు నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

Related posts

సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేయాలి

Satyam NEWS

వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌…ఎన్టీఓ సంస్థ ఆధ్వ‌ర్యంలో అభివృద్ది…!

Satyam NEWS

న్యూ లైన్:16న కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment