34.7 C
Hyderabad
May 4, 2024 23: 50 PM
Slider ముఖ్యంశాలు

కరోనా పై పోరాటానికి వివిన్ డ్రగ్స్ విరాళం రూ.25 లక్షలు

vvin drugs

కరోనా పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సహాయంగా నేడు పలువురు విరాళాలు ప్రకటించారు. రైన్ బో ఆసుపత్రి సిఎండి డాక్టర్ కంచర్ల రమేష్ 5 వేల పిపిఇ కిట్లు, 10 వేల ఎన్95 మాస్కులు 2 లక్షల 3ప్లే మాస్కులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేశారు. వీటివిలువ సమారు కోటి రూపాయల వరకూ ఉంటుంది.

అదే విధంగా వివిన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ చైర్మన్ బొత్తా పర్వతయ్య 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు. నేడు ఆయన ఈ విరాళాన్ని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్ర కేటీఆర్ ను కలసి అందచేశారు. కరోనాపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయంగా ఈ విరాళం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఆయన చేసిన సహాయానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఎస్ ఏ ఆర్ ఖె ప్రాజెక్ట్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ రూ.20 లక్షలు, టికేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.12 లక్షలు, ఇండియన్ డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తెలంగాణ విభాగం రూ.11 లక్షలు, ఎస్ఎస్బి ఇన్ ఫ్రా డెవలపర్స్ రూ.10 లక్షలు,

ఏఐఎం ఆసియా అధ్యక్షుడు బిషప్ డాక్టర్ జాబ్ లోహరా రూ.10 లక్షలు, శతాబ్దీ టౌన్ షిప్ రూ.10 లక్షలు, బింజ్సరియా ఇస్పాత్ రూ.10 లక్షలు, ఆల్ ఇండియా తెలగ, కాపు బలిజ సంఘం రూ 5,01,116, ఆర్టిస్ట్ ఎం సాగర్ రూ.5 లక్షలు, షనాయ్ హాస్పిటల్స్ రూ.5 లక్షలు, ఇమాన్యుయేల్ రిసార్ట్స్ రూ.5 లక్షలు నేడు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందచేశాయి.

Related posts

కాంట్ హెల్ప్:నౌకలోని భారతీయులను విడిపించలేం

Satyam NEWS

కుమరం పులి:సామాన్యుడి అసామాన్య పోరాటం

Satyam NEWS

ఎగుమతులు నిషేధించినా పెరగడం ఆగని గోధుమ ధరలు

Satyam NEWS

Leave a Comment