37.2 C
Hyderabad
May 2, 2024 14: 16 PM
Slider మహబూబ్ నగర్

కరోనా కట్టడిలో రాజీ పడని వనపర్తి పోలీసులు

wanaparty police

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఊహించని విధంగా తన ప్రతాపం చూపిస్తున్నప్పటికి పోలీసుల ముందు జాగ్రత్త చర్యలతో మన జిల్లాదరి చేరనీయలేదని వనపర్తి రురల్ SI షేక్ షఫీ మీడియాతో అన్నారు. వనపర్తి రూరల్ పోలీస్టేషన్ ముందు మండుటెండలో ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు విధులు నిర్వహించే పోలీసుల కోసం జిల్లా SP ఆదేశానుసారం గుడారం ఏర్పాటు చేసుకుంటున్నట్లు SI తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అవసరాన్నిబట్టి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వేగవంతంగా అమలు చేయడంతోనే ఈ జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అభిప్రాయపడ్డారు.

ఏదిఏమైనా మా పరిధిలో ఒక్క కరోన కేసు నమోదు కాకుండా ఉండే విధంగా తమ సిబ్బంది రాత్రి, పగలు ఎండలను సహితం లెక్కచేయకుండా కాపు కాస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి తగ్గట్టుగా ప్రజలు ఇళ్ళల్లో నుండి బయటికి రాకుండా తమకు సహకరించి కరోనావైరస్ ను తరిమికొట్టాలని ఆయన ప్రజలను కోరారు.

Related posts

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

పరిశ్రమలు తెచ్చి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తా

Bhavani

తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శిగా పతివాడ

Satyam NEWS

Leave a Comment